AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు ఇంతకంటే ముఖ్యమైన పని ఏం ఉంటుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Telangana CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఏముంటుంది? దేశ్‌కీ నేత కావాలని అనుకున్నప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లాలి కదా అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు ఇంతకంటే ముఖ్యమైన పని ఏం ఉంటుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Minister Kishan Reddy
Venkata Chari
|

Updated on: May 27, 2023 | 12:54 PM

Share

NITI Aayog: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీతి అయోగ్ 8వ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదని, ఇంతకంటే ముఖ్యమైన పని సీఎంకు ఏం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో హెల్త్, ఊమెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లపై చర్చ సాగుతోందని, టీమ్ ఇండియా స్పిరిట్ తో సమావేశాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

బ్రిటన్ లాంటి దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరుకున్నామని, నీతి ఆయోగ్ సమావేశం కన్నా సీఎం కేసీఆర్‌కి అతి ముఖ్యమైన పని ఏముంటందని కిషన్ రెడ్డి విమర్శించారు.

‘దేశ్ కి నేత కావాలనుకునే నేత.. దేశ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న చర్చలో పాల్గొనాలని తెలియదా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం కేసీఆర్‌కి సోయి లేదంటూ ఘాటుగా మాట్లాడారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం వేతనాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, అప్పులు ముంచుకొస్తున్నాయని, ఆదాయానికి మించి సీఎం కేసీఆర్ అప్పులు చేశారని, కేసీఆర్ కుటుంబానికి అప్పుల దాహం తీరడం లేదంటూ కిషన్ రెడ్డి ఏకిపారేశారు.

అలాగే ‘భూములు అమ్మడంతో కేసీఆర్ ఆకలి తీరడం లేదని, 111 జీవో రద్దుతో హైదరాబాద్ నగరానికి ఎప్పుడైనా ప్రమాదం ఎప్పుడైనా పొంచి ఉంది, అసైన్డ్ భూములను అమ్ముకుంటున్నారు’ అంటూ విమర్శలు చేశారు.

‘వరంగల్ జైలు భూములను తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి 10 ఏకరాల భూమిని కేసీఆర్ కేటాయించారు. రియల్ ఎస్టేట్ కోసమే 111 జీవో రద్దు చేశారంటూ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా విమర్శలు గుప్పించారు.

మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..