Hyderabad: అబిడ్స్‌లోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. చుట్టుపక్కలకు ఎగసిపడ్డ మంటలు! వీడియో

|

Oct 28, 2024 | 6:25 AM

హైదరాబాద్ లోని ఓ బాణాసంచా దుఖాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో షాఫులో అధిక మంది ఉండటంతో వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. దుఖాణం నుంచి టపాసులు ఒకదానికొకటి అంటుకుని భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..

Hyderabad: అబిడ్స్‌లోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. చుట్టుపక్కలకు ఎగసిపడ్డ మంటలు! వీడియో
Fire Accident At Cracker Shop
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్ 28: హైదరాబాద్‌లోని అబిడ్స్‌ పరిధిలోని ఓ బాణా సంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అబిడ్స్‌లోని బొగ్గుల కుంటలో ఉన్న పారాస్‌ బాణాసంచా షాపులో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కాసేపటికే మంటలు పక్కనే ఉన్న హోటల్‌కు కూడా వ్యాపించాయి. దీంతో జనం భయంతో పరుగులు తీశారు.

నిన్న ఆదివారం కావడంతో టపాసులు కొనేందుకు అధిక సంఖ్యలో జనాలు రోడ్లపైకి వచ్చారు. దేవాదాయ శాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. టపాలు ఒకదానికి ఒకటి అంటుకుని పేలడంతో అవి పక్కనే ఉన్న దుకాణాలకు, పార్కింగ్‌లో ఉన్న వాహనా మీద కూడా పడటంతో వాటికీ మంటలు అంటుకున్నాయి. దీంతో ఎటుచూసినా భీతావహ దృశ్యాలు కనిపించాయి. బాణసంచా దుకాణంలో ఎక్కువగా బాణాసంచా ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల జనాలు తీవ్ర భయాందోళనలతో పరుగులు తీశారు. బాణాసంచా దుకాణం నుంచి మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో సమీపంలో ఉన్న దాదాపు 10కి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటీన అక్కడికి చేరుకుని 5 ఫైరింజన్లతో అతి కష్టంమీద మంటలు అదుపు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనలో ఇద్దరు మహిళకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్సులో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి వీడియో దృశ్యాలు స్థానికులు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా దీపావళి సందర్భంగా ప్రతీయేట టపాసుల దుకాణాలు అన్ని జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ.. ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులు ఎన్ని సార్లు చెప్పినా.. కొంతమంది వ్యాపారులు మాత్రం ఆ సూచనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.