AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంక్.!

కర్ర ఇచ్చి పళ్లు రాలగొట్టించుకోవడం అంటే ఇదేనేమో.. బుద్దిగా పని చేసుకుంటాడని ఉపాధి కలిపించిన పోలీసులకే ఓ దొంగ తన దొంగ బుద్ధి చూపించాడు. 200 పైగా చోరీలు చేసిన నిందితుడికి ఉపాధి కల్పిస్తే మారుతాడని భావించారు పోలీసులు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందే ఓ టిఫిన్ సెంటర్‌ను పెట్టించారు.

పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంక్.!
Representative Image
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: May 07, 2024 | 8:16 PM

Share

కర్ర ఇచ్చి పళ్లు రాలగొట్టించుకోవడం అంటే ఇదేనేమో.. బుద్దిగా పని చేసుకుంటాడని ఉపాధి కలిపించిన పోలీసులకే ఓ దొంగ తన దొంగ బుద్ధి చూపించాడు. 200 పైగా చోరీలు చేసిన నిందితుడికి ఉపాధి కల్పిస్తే మారుతాడని భావించారు పోలీసులు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందే ఓ టిఫిన్ సెంటర్‌ను పెట్టించారు. 2 ఏళ్లు టిఫిన్ సెంటర్‌ను నడిపించిన సదరు దొంగ తన దొంగ బుద్ధి మార్చుకోక పోలీసుల కండ్లు కప్పి మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడు. చోరీలు చేశాక పోలీసులకు దొరకుండా ఏమి చెయ్యాలో సినిమాలు చూసి నేర్చుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.

ఈ దొంగ ముచ్చట చూస్తుంటే కలకాలపు ఓ దొంగ ఒక రోజు దొరుకును అనే సామెత గుర్తు వస్తుంది. వరుసగా దొంగతనాలు చేస్తూ 2021లో పట్టుబడిన 50 ఏళ్ల వెంకట రమణను పోలీసులు మార్చాలనుకున్నారు. ఉపాధి కలిపిస్తే మారతాడని భావించారు. అతడితో ఓ టిఫిన్ సెంటర్‌ను పెట్టించారు. బాగానే 2 ఏళ్ల పాటు నడిపించాడు. ఆ తరువాత పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయో.. ఏమో తిరిగి తన దొంగ వృత్తిని పోలీసుల కళ్లు కప్పి మొదలు పెట్టాడు. రాచకొండ కమిషనరేట్ ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. అటు పోలీసులకు.. ఇటు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని సీసీ కెమెరాలు ఉంటే దివ్యాంగుడిలా నటించేవాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేయగా.. దివ్యాంగుడిలా నడిచే వ్యక్తే దొంగగా గుర్తించారు. నిందితుడు వద్ద నుండి 21 తులాల బంగారం, కిలో వెండి, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వెంకట రమణపై మిర్యాలగూడ, కోదాడ, సిద్దిపేట, ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

Follow Us
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
ఒక కప్పు గోదుమపిండి 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్..
ఒక కప్పు గోదుమపిండి 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్..