Secunderabad: అప్పటిలోపు సికింద్రాబాద్‌ అభివృద్ధి పనులు పూర్తి: రైల్వే సహాయ మంత్రి

దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి రన్విత్ సింగ్ అన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారని.. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా...

Secunderabad: అప్పటిలోపు సికింద్రాబాద్‌ అభివృద్ధి పనులు పూర్తి: రైల్వే సహాయ మంత్రి
Representative Image
Follow us

|

Updated on: Aug 25, 2024 | 7:22 AM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే శాఖ సహాయ మంత్రి రన్విత్ సింగ్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. సౌత్ సెంట్రలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. 2026లోపు స్టేషన్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి రన్వీత్ సింగ్ అన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారని.. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మొత్తం 700 కోట్లతో సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు చేపట్టామన్నారు రన్విత్‌ సింగ్‌.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిధిలో సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని.. నీటి సదుపాయం కల్పించేందుకు పెద్ద ఎత్తున ట్యాంకులను సైతం సిద్ధం చేస్తున్నామన్నారు. కొత్త ప్లాట్ ఫామ్స్, లిఫ్ట్‌లు, వైయిటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలను సైతం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్‎లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 119 రైల్వే స్టేషన్లను రూ.5వేలకోట్లతో అభివృద్ధి చేయాలని సూచించారని.

ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ని సైతం అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో వైపు రైళ్లలో జనరల్‌ బోగీలను సైతం పెంచనున్నట్లు తెలిపారు. దశల వారీగా జనరల్‌ బోగీలు పెంచి.. ప్రయాణిలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 2026లోపు స్టేషన్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అతి త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ అందుబాటులోకి రానుందని రన్విత్‌ సింగ్‌ తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్
కుటుంబాల మద్య చిచ్చు పెట్టిన ప్రేమ వ్యవహారం.. కర్రలతో బీభత్సం
కుటుంబాల మద్య చిచ్చు పెట్టిన ప్రేమ వ్యవహారం.. కర్రలతో బీభత్సం