
G20 Agriculture Ministers Meeting: జూన్ 15 నుంచి మూడో రోజుల పాటు హైదరాబాద్‌లో వ్యవసాయ రంగంపై G- 20 సమావేశాలు నిర్వహిస్తారు. G-20 దేశాలతో పాటు పలు దేశాల వ్యవసాయ మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. వ్యవసాయ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇది మించి పరిణామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కరోనా తర్వాత తలెత్తిన అనేక రకాల అంశాలపై విస్తృత చర్చలకు జీ-20 వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. మొత్తం 46 రంగాలకు సంబంధించి 250కు పైగా సమావేశాలు భారత్‌లో సాగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 56 నగరాల్లో 140 సమావేశాలు ముగిశాయన్నారు. మరికొన్ని నగరాల్లో సమావేశాలు జరగాల్సి ఉందని వివరించారు.
గోవా వేదికగా పర్యాటక, సాంస్కృతిక తుది సమావేశాలు జూన్ 19 నుంచి 4 రోజుల పాటు జరుగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన తుది సమావేశాలు జరుగుతాయని, అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాలకు 29 దేశాల అధినేతలు హాజరవుతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..