AP – TS: ఎటూ తేలని జలాల పంచాయితీ..! KRMB సమావేశంలో ఏపీ – తెలంగాణ మధ్య వాడీవేడీ చర్చ..

|

May 10, 2023 | 8:09 PM

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు KRMB సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదలశాఖ అధికారులు సమావేశానికి వచ్చారు. తమ దగ్గరే క్యాచ్‌మెంట్‌ ఏరియా అధికంగా ఉండటంతో కృష్ణా జలాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా ఉండాలని మరోసారి కోరింది తెలంగాణ.

AP - TS: ఎటూ తేలని జలాల పంచాయితీ..! KRMB సమావేశంలో ఏపీ - తెలంగాణ మధ్య వాడీవేడీ చర్చ..
Krmb Meeting
Follow us on

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు KRMB సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదలశాఖ అధికారులు సమావేశానికి వచ్చారు. తమ దగ్గరే క్యాచ్‌మెంట్‌ ఏరియా అధికంగా ఉండటంతో కృష్ణా జలాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా ఉండాలని మరోసారి కోరింది తెలంగాణ. అలాగే శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని పునరుద్ఘాటించింది. అయితే తెలంగాణ లేవనెత్తిన ఈ అంశాలపై అభ్యంతరం తెలియజేసింది ఏపీ. 66.. 34 నిష్పత్తి ప్రకారం ఏపీకి కేటాయించిన నీట వాటా ప్రకారం తాము ఎక్కడ నుంచి ఎంతైనా వాడుకుంటామని.. ఇందులో షరతులకు తావే లేదని స్పస్టం చేశారు ఏపీ అధికారులు. సుంకిశాల ఇన్‌టెక్‌వెల్‌పై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది తెలంగాణ. ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకుంటామని వెల్లడించారు తెలంగాణ అధికారులు.

ఆర్డీఎస్‌కు అత్యవసర మరమ్మతులు ఉంటే చేపట్టేందుకు నిర్ణయించారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడికాల్వ పనులు చేపట్టడం లేదని ఏపీ తెలియజేసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర జలసంఘం CWCకి నివేదిస్తారు. అక్కడ రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను పరిశీలించి నిర్ణయం వెల్లడిస్తారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న కృష్ణానదీ జలాల జగడంపై KRMB సమావేశంలో వాడీవేడీ చర్చ జరగడం.. CWC ఏం చేస్తుందనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..