TSRTC: వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ టికెట్‌పై 20 శాతం తగ్గింపు.. పూర్తి వివరాలు..

TSRTC T24 Tickets: హైదరాబాద్ ప్రయాణికులకు, పుస్తక ప్రియులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భాగ్యనగరంలోని ఎన్టీఆర్‌ మైదానంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను

TSRTC: వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ టికెట్‌పై 20 శాతం తగ్గింపు.. పూర్తి వివరాలు..
Tsrtc
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 20, 2021 | 11:14 AM

TSRTC T24 Tickets: హైదరాబాద్ ప్రయాణికులకు, పుస్తక ప్రియులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భాగ్యనగరంలోని ఎన్టీఆర్‌ మైదానంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించేలా కీలక ప్రకటన చేసింది. విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రూ.వంద టిక్కెట్‌పై 20 శాతం రాయితీ ప్రకటిస్తూ టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ సజ్జనార్ ప్రకటన చేశారు. నగరంలో 24గంటల టికెట్‌పై ఈ నెల 27 వరకు తగ్గింపు పొందవచ్చని టీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నగరంలో 24 గంటలపాటు చెల్లుబాటు అయ్యే రూ.100 టీ24 టిక్కెట్‌ కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుందంటూ ఆర్టీసీ తెలిపింది. గతంలో మాదిరి కాకుండా.. ముందు రోజు ఏ సమయానికి ఈ టిక్కెట్‌ కొనుగోలు చేస్తారో.. మరుసటి రోజు అదే సమయం వరకు దీనిని వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రయాణికులు దీనిని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

కాగా.. హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండుగ శనివారం ప్రారంభమైంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్టూ బుక్ ఫేయిర్‌ను నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించిన వారికే లోపలికి అనుమతిస్తున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, ఇంగ్లీష్ తోపాటు పలు భాషలకు చెందిన పుస్తకాలను బుక్‌ ఫెయిర్‌లో ప్రదర్శనలో ఉన్నాయి. ఈనెల 27 వరకు జరిగే బుక్‌ ఫెయిర్ ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.30 వరకు.. శని, ఆదివారాలు, సెలవుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9గంటల వరకు నిర్వహిస్తారు.

Also Read:

Viral Video: వామ్మో.. నెటిజన్లను షేక్ చేస్తున్న నాగులు.. మూడు ఒకేచోట మీటింగ్.. ఎందుకో ఏమో..

Warangal: హనుమకొండలో దారుణం.. దహన సంస్కారాలకు దారి ఇవ్వకపోవడంతో ఇంట్లోనే మృతదేహం..!