Telangana: వాహనదారులకు అలర్ట్.. పన్ను బకాయిలకు రవాణాశాఖ చర్యలు

|

Jun 05, 2022 | 12:36 PM

రోజులకు తరబడి పన్నులు చెల్లించుకుండా తిరుగుతున్న వాహనదారుల కోసం రవాణాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాగైనా వారి నుంచి పన్ను బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించారు. సరైన పత్రాలు లేకుండా...

Telangana: వాహనదారులకు అలర్ట్.. పన్ను బకాయిలకు రవాణాశాఖ చర్యలు
Traffic Challan
Follow us on

రోజులకు తరబడి పన్నులు చెల్లించుకుండా తిరుగుతున్న వాహనదారుల కోసం రవాణాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాగైనా వారి నుంచి పన్ను బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించారు. సరైన పత్రాలు లేకుండా రోడ్డెక్కే వాహనదారుల నుంచి మూడు వందల రెట్లు అధికంగా జరిమానా విధించేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పోలీసులు అధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి సారించారు. ఫలితంగా సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అంతగా పట్టించుకోలేదు. తద్వారా బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వాళ్లు పన్ను కట్టకపోవడంతో సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బకాయిల వసూళ్లపై ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఫలితంగా సరైన పత్రాలు లేనివాహనదారులపై చెల్లించాల్సిన దానికి మూడు వందల రెట్లు అధికంగా జరిమానా చెల్లించాలనే రవాణాశాఖ అధికారులు నిబంధనలు అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అంశపై అవగాహన కూడా కలిగిస్తున్నారు.

ప్రస్తుతం విద్యాసంస్థలు, వ్యవసాయ పనుల కోసం ఎన్నో వాహనాలు రోడ్డెక్కుతాయి. ఆటోలు, ట్రాక్టర్లకు ప్రభుత్వం రోడ్డు పన్ను రద్దు చేసింది. మిగిలిన అన్ని రకాల పన్నులు చెల్లించాల్సి ఉంది. వాహనం నడిపేవారు రిజిస్ట్రేషన్‌తో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫిట్‌నెస్, పర్మిట్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్ తదితర పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వాటిని నిర్ణీత గడువులోపు రెన్యూవల్‌ చేయించుకోవాలి. కానీ.. పన్నులు చెల్లించాల్సి ఉండటంతో రెన్యూవల్‌ చేయించుకోకుండా వాహనాలను తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి