Hyderabad: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే ప్రాంతాల్లో, ఏ సమయంలో..

దీపావళి తర్వాతి రోజు జరిగే ఈ వేడుకల్లో యాదవులు పెద్ద ఎత్తున హాజరై సంబురంగా జరుపుకుంటారు. దున్నపోతులను ఆడిస్తూ సందడి చేస్తారు. ఈ వేడుకలను చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా హాజరవుతుంటారు. సదర్‌ ఉత్సవాల్లో దున్నపోతులను ముస్తాబు చేసి, విన్యాసాలు చేస్తుంటారు. ఇందుకోసం హరియాణా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన దున్నపోతుల్ని నగరానికి తీసుకువస్తారు...

Hyderabad: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే ప్రాంతాల్లో, ఏ సమయంలో..
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 14, 2023 | 10:53 AM

దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. దేశంలోని పలు ప్రధాన పట్టణాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదిలా ఉంటే దీపావళి వేడుకలు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో జరిగే సదర్‌ వేడుకలకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దీపావళి తర్వాతి రోజు జరిగే ఈ వేడుకల్లో యాదవులు పెద్ద ఎత్తున హాజరై సంబురంగా జరుపుకుంటారు. దున్నపోతులను ఆడిస్తూ సందడి చేస్తారు. ఈ వేడుకలను చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా హాజరవుతుంటారు. సదర్‌ ఉత్సవాల్లో దున్నపోతులను ముస్తాబు చేసి, విన్యాసాలు చేస్తుంటారు. ఇందుకోసం హరియాణా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన దున్నపోతుల్ని నగరానికి తీసుకువస్తారు.

ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సదర్‌ వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం సదర్‌ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు (మంగళవారం) ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. నగరంలోని పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్ల వారుజామున 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి తమకు సహకరించాలని తెలిపారు.

ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

* కాచిగూడ ఎక్స్‌ రోడ్‌ నుంచి వైఎంసియే రూట్‌లో వచ్చే వాహనాలు టూరిస్ట్ హోటల్‌ రోడ్‌ వైపు మళ్లించనున్నారు.

* ఇక విఠల్‌ వాడి క్రాస్‌ రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను.. భవాన్స్ న్యూ సైన్స్ కాలేజీ, కింగ్ కోటి మీదుగా మళ్లించనున్నారు.

* ఇదిలా ఉంటే స్ట్రీట్ నంబర్ 8 నుంచి వైయంసియే వైపు వెహికిల్స్‌ను అనుమతించరు. ఆ దారిలో వచ్చే వాహనాలను రెడ్డి కాలేజ్ బహదూర్ పుర వైపు పంపిస్తారు.

* ఇక ఓల్డ్ బర్కథ్ పుర పోస్ట్ ఆఫీస్ నుంచి వైయంసియే వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను క్రౌన్ కేఫ్, బాగ్ లింగంపల్లి వైపు మళ్లిస్తారు. అలాగే ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీస్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను విఠల్ వాడి వైపు మళ్లిస్తారు.

* బర్కత్ పుర చమాన్ నుంచి వైయంసియే వైపునకు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గంలో వచ్చే వాహనాలు.. బర్కత్ పుర క్రాస్ రోడ్స్, టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు.

* ఇక బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజ్ వైపు వచ్చే వాహనాలు అనుమతించరు. ఈ దారిలో వచ్చే వాహనాలను నారాయణగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.

* సికింద్రబాద్ నుంచి కింగ్ కోటి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్ రోడ్స్, బార్కత్ పుర, బాగ్ లింగంపల్లి, వియస్టి, మీదుగా మళ్లించనున్నారు.

* సదర్‌ వేడుకకు హాజరయ్యే వారి వాహనాలను శాంతి థియేటర్, రెడ్డి కాలేజ్, మెల్కొట్ పార్క్, దీపక్ థియేటర్ వద్ద పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!