హైదరాబాద్ టెర్రర్ లింక్స్‌కి సంబంధించి షాకింగ్ డీటెయిల్స్ బైటికొస్తున్నాయి. భోపాల్ ATS పోలీసుల రైడ్‌లో పట్టుబడ్డవాళ్లంతా ఏడాదిన్నరగా ఇక్కడ రాడికల్ ఇస్లామ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అధికారులకు అనుమానం రాకుండా నిందితులందరూ తమతమ ఇళ్లూ పక్కపక్కనే ఉన్నట్టు వాళ్ల ఆధార్ కార్డుల్ని తయారుచేసుకున్నారు. కూలీ నుంచి డెంటిస్ట్ వరకు రకరకాల వృత్తుల్లో కొనసాగుతున్నారు. అధికారులకు అనుమానం రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉగ్రకుట్ర కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సల్మాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు. ఉగ్రవాద కుట్రలో అరెస్టు చేసిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 19 వరకు నిందితులకు రిమాండ్ విధించింది.
అడవుల్లో శిక్షణ ఇచ్చేందుకు.. 16 మంది నిందితులు హైదరాబాద్ వచ్చారు. డార్క్ వెబ్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తున్నారు. పెద్ద నగరాలను టార్గెట్ చేస్తూ నిందితులు స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో సలీమ్, రెహ్మాన్, అబ్బాస్..
హమీద్, జునైద్, సల్మాన్ అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీరంతా ఎంతమందిని ఉగ్రవాదం వైపు మళ్లించారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఉగ్ర కుట్ర నేపథ్యంలో భాగ్యనగరం పోలీసులు అలర్ట్ అయ్యారు. రాచకొండ పరిధిలో ఉగ్రవాదుల కదలికలు లేవని, ఐనా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు సీపీ దేవేందర్‌సింగ్. అటు.. యాదాద్రి ఆలయ భద్రతపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు కమిషనర్. జంటనగరాల్లోని చారిత్రక ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..