Statue of Equality: తెలంగాణ సచివాలయానికి డా.బిఆర్.అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు గాను ‘‘ది ప్రాక్టీసింగ్ బుద్దిస్ట్ సొసైటీ( బౌద్ధ ఉపాసక్ మహాసభ)’’వారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు లక్నో నుంచి సొసైటీ ప్రధాన కార్యదర్శి కే.ఆర్.రావత్ సిఎం కేసీఆర్ గారికి లేఖను పంపించారు. ఆ లేఖలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌ని అభినందించడంతో పాటు ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామని పేర్కొన్నారు.
‘తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా. బిఆర్. అంబేద్కర్ పేరు పెట్టి , పక్కన్నే ఆయన జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గొప్ప విషయం. ఈ దిశగా మీరు వేసిన అడుగు అంబేద్కర్ భావజాలాన్ని విశ్వసించే వారికి శభువార్త గా సంతోషాన్ని కలిగిస్తున్నది. ఇంత గొప్ప కార్యాన్ని చేపట్టిన మీకు.. బౌద్ధ ఉపాసక్ మహాసభ కోటి కోటి అభినందనలు తెలియజేస్తున్నది. అనునిత్యం ఇటువంటి విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టేలా, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరింతగా కృషి కొనసాగించేలా, మీకు సదా ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను శక్తిని ప్రసాదించాలని, ఆ బుధ్ధ భగవానున్ని ప్రార్థిస్తున్నాము..’ అంటూ ది ప్రాక్టీసింగ్ బుద్ధిస్ట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కే.ఆర్. రావత్ తమ లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..