Electricity Bills: బీ అలెర్ట్.! కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారా.? ఇకపై ఆ యాప్స్‌లో కుదరదు

|

Jul 02, 2024 | 8:28 AM

ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై వారందరికీ ముఖ్య అలెర్ట్. ఆ యాప్స్ ద్వారా ఈ నెల నుంచి కరెంట్ బిల్లులు కట్టడం ఇక కుదరదు. క్రెడిట్ కార్డుతో సహా..

Electricity Bills: బీ అలెర్ట్.! కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారా.? ఇకపై ఆ యాప్స్‌లో కుదరదు
Current Bills
Follow us on

ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై వారందరికీ ముఖ్య అలెర్ట్. ఆ యాప్స్ ద్వారా ఈ నెల నుంచి కరెంట్ బిల్లులు కట్టడం ఇక కుదరదు. క్రెడిట్ కార్డుతో సహా.. ఆ థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సేవలను నిలిపివేయడమే ఇందుకు కారణం. జూలై 1 నుంచి కొత్తగా ఆర్‌బీఐ రూల్స్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో.. ఇకపై TGSPDCL, TGNPDCL, APSPDCL, APEPDCL, APCPDCL డిస్కమ్‌ల పరిధిలోకి వచ్చే అన్ని కరెంట్ బిల్లులు ఆయా సంస్థల అఫీషియల్ వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు బిల్లు చెల్లింపుల్లో భద్రతకు పెద్దపీట వేస్తూ ఆర్బీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బిల్ పేమెంట్ సిస్టం ద్వారానే బిల్లు చెల్లింపులన్నీ జరగాలని నిర్దేశించింది. దీంతో ఈ కొత్త నిబంధనలన్నీ కూడా జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ప్రధాన బ్యాంకులు ఇంకా భారత్ బిల్ పేమెంట్ సిస్టంను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఆయా బ్యాంకులకు చెందిన కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించినట్లయితే.. అవి ప్రాసెస్ కావు. ఇక ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపులలోనూ అదే జరిగింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..