Telangana: TGPSC కీలక నిర్ణయం.. గ్రూప్2 నియామకాల తర్వాతే.. గ్రూప్3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్!
తెలంగాణలో గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌ను వాయిదా వేస్తూ TGPSC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలని TGPSC నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బ్యాక్ లాగ్ పోస్టుల సమస్య రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీజీపీఎస్‌సీ తెలిపింది.

తెలంగాణలో 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్‌సీ మార్చి 15న ఫలితాలను విడుదల చేసింది. అయితే, ఈ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించింది. అయితే గ్రూప్-2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాతే గ్రూప్-3 వెరిఫికేషన్ చేయాలని అభ్యర్థుల నుంచి వినతి రావడంతో గ్రూప్-3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌ను వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పోస్టుల బ్యాక్ లాగ్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కొత్త షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

Tgpsc 1
గ్రూప్ -3 పోస్టుల భర్తీకి పరీక్ష రాసిన అభ్యర్థుల్లో జనరల్ ర్యాంకింగ్ ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను టీజీపీఎస్సీ పిలిచింది. జూన్ 18 నుంచి జులై 7 వరకు రోజు రెండు సెషన్స్ లో ఎంపిక చేసిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కమిషన్ ఆహ్వానించింది. జులై 9న రిజర్వ్ డే ప్రకటించింది. అయితే గ్రూప్ -3 సర్టిఫికెట్ వెరిఫికెషన్ షెడ్యూల్ వెలువడిన వెంటనే గ్రూప్-2 లో సైతం ర్యాంకులు సాధించిన అభ్యర్థులు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగానే పోస్టుల ఎంపికపై వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉన్నందున.. గ్రూప్ -2 సర్టిఫికెట్ వెరిపికేషన్ తర్వాతే గ్రూప్ -3 చేయాలని కోరారు. దీంతో బ్యాక్ లాగ్ పోస్టులు ఉండకండా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-3 వెరిఫికేషన్ ను కమిషన్ వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీలను వెల్లడించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.