Hyderabad: వీటిని బొమ్మ చిలుకలు అనుకునేరు.. అసలు యవ్వారం తెలిస్తే ఫ్యూజులౌట్..

|

Jan 18, 2023 | 8:49 PM

చూడచక్కగా ఉండి, ముచ్చట గొలిపే అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: వీటిని బొమ్మ చిలుకలు అనుకునేరు.. అసలు యవ్వారం తెలిస్తే ఫ్యూజులౌట్..
Alexandrine Parrot
Follow us on

చూడచక్కగా ఉండి, ముచ్చట గొలిపే అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు పది రామచిలుకలను ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా.. విశ్వనీయ సమాచారం మేరకు అటవీ శాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ దాడి చేసి పట్టుకుంది. హైదరాబాద్ షాద్‌నగర్‌లో వీటిని కొని తరలిస్తుండగా ఆరామ్‌ఘర్ దగ్గర పట్టుకున్నారు. అహసుద్దీన్, సయాద్ బుర్హానుద్దీన్‌ల నుంచి 10 అరుదైన రామచిలుకలను అటవీశాఖ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వైల్డ్ లైఫ్ చట్టం1972 ప్రకారం ఈ రకమైన రామచిలుకలను వేటాడటం, వెంట ఉంచుకోవటం నేరమని పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ హెచ్చరించారు.

విచారణలో తాము వీటిని 25 వేల రూపాయలకు అమ్మేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఈరకమైన వ్యాపారం వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించవచ్చని అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న చిలుకలను నెహ్రూ జూ పార్క్ కు తరలించి సంరక్షించాలని పీసీసీఎఫ్ ఆదేశించారు. చిలుకలను రక్షించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, హైదరాబాద్, యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శంషాబాద్, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..