ఫ్రాన్స్‌ వేదికగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సదస్సు.. హాజరుకానున్న ప్రముఖులు, తెలుగు భాషాభిమానులు

|

Sep 07, 2022 | 1:40 PM

తేనె కన్నా తియ్యనైన తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా వచ్చే ఏడాది ఫ్రాన్స్‌ వేదికగా తెలుగు భాష, సాహిత్య సాంస్కృతిక సదస్సును నిర్వహించనున్నారు.

ఫ్రాన్స్‌ వేదికగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సదస్సు.. హాజరుకానున్న ప్రముఖులు, తెలుగు భాషాభిమానులు
Telugu Literature Conferen
Follow us on

తేనె కన్నా తియ్యనైన తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా వచ్చే ఏడాది ఫ్రాన్స్‌ వేదికగా తెలుగు భాష, సాహిత్య సాంస్కృతిక సదస్సును నిర్వహించనున్నారు. జూన్‌ 22, 23, 24వ తేదీల్లో జరిగే ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది తెలుగు భాషాభిమానులు, రచయితలు, ప్రజాప్రతినిధులతో పాటు కళాకారులు పాల్గొననున్నారు. సదస్సులో భాగంగా పద్య నాటకాలు, బుర్రకథలు, హరికథలు, జానపద కళలను ప్రదర్శించనున్నారు. అలాగే తెలుగు పుస్తకాలు, తాళపత్రాలతో ఓ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేయనున్నారు. కాగా ఈ సదస్సు నిర్వహణకు గానూ తెలుగు రాష్ట్రాల సహకారం కోరేందుకు ఫ్రాన్స్‌లో తెలుగు భాషాభిమాని డానియెల్‌ నేజెర్స్‌ హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు.

ప్రస్తుతం ప్యారిస్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ అండ్‌ సివిలైజేషన్‌ విశ్వవిద్యాలయంలో సౌత్‌ ఆసియా, హిమాలయన్‌ స్టడీస్‌లో తెలుగు విభాగం అధిపతిగా కొనసాగుతున్న డానియెల్‌. కాగా 2020లోనే ఈ తెలుగు సదస్సును నిర్వహించాలనుకున్నామని అయితే కరోనా అడ్డుపడిందంటున్నారు డానియెల్‌. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో వచ్చే ఏడాదిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని నేజెర్స్‌ పేర్కొన్నారు. సదస్సు నిర్వహణ కోసం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ అందజేస్తానని, మళ్లీ నవంబర్‌లో వచ్చి పెద్దలందరినీ కలుస్తానంటున్నారు. ‘గత ఏడాది నవంబరులో మంత్రి కేటీఆర్‌ ప్యారిస్‌ వచ్చినప్పుడు కలిశాను. సదస్సు నిర్వహణకు సంబంధించి ఇద్దరం చర్చించాం. అదే విధంగా యునెస్కో సహాయం కూడా తీసుకుంటున్నాం’ అని డానియల్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..