Hyderabad Traffic Restrictions: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లారంటే అంతేసంగతులు!

|

Jul 03, 2023 | 6:26 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. మంగళవారం (జులై 4) ఉదయం 10 గంటల నుంచి..

Hyderabad Traffic Restrictions: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లారంటే అంతేసంగతులు!
Hyderabad Traffic Restrictions
Follow us on

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. మంగళవారం (జులై 4) ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు హనుమాన్ ఆలయం, హకీంపేట్ వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్‌కుంట ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. అటుగావెళ్లే వాహనాలను వేరే రూట్లకు మళ్లించనున్నారు.

బొల్లారం, అల్వాల్, లోత్‌కుంట, త్రిముల్‌ఘేరి, కార్ఖానా, జేబీఎస్, ప్లాజా జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్.. రూట్లలో వచ్చే ట్రాఫిక్‌ను రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేరే రూట్లకు మళ్లిస్తారు. ఆ వాహనాలను హెచ్‌పీఎస్‌ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ మోనప్ప జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ఈ మేరకు ఆయా సమయాల్లో వాహానదారులకు ట్రాఫిక్‌ పోలీసులు సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలున్న రూట్లలో వాహనదారులు అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.