Tilak Varma: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు ఘన స్వాగతం
ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి భారత్ 9వ సారి టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన మన తెలుగు తేజం యువ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి తిలక్‌వర్మకు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధిచిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను మట్టికలిపించి భారత్ 9వ సారి టైటిల్ సొంత చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సోమవారం (సెప్టెంబర్ 29, 2025) రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వచ్చిన తిలక్ వర్మకు అధికారులు, భారీ సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాల దేవి తిలక్‌ను సన్మానించారు.
డోళ్ళు, డప్పులతో పాటు అభిమానులు “తిలక్… తిలక్” అని అరుస్తూ పోస్టర్లు, బ్యానర్లతో స్వాగతం పలికారు. తిలక్ కారు సన్‌రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేశాడు. తిలక్ వర్మను చూసేందుకు అభిమానులు భారీగా చేరుకోవడంలో అక్కడ రద్దీ ఏర్పడింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా ఇవి కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారాయి
వీడియో చూడండి..
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తిలక్ వర్మ
ఘనస్వాగతం పలికిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
తిలక్‌ను సన్మానించిన అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి #TilakVarma #ShamshabadAirport #AsiaCup2025 #TV9Telugu pic.twitter.com/mMPE9INnZF
— TV9 Telugu (@TV9Telugu) September 29, 2025
మరోవైపు ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ అదరగొట్టాడు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును ముందుంగా నడిపించాడు. అదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక లక్ష్యం ఛేదనలో భాగంగా బరిలోకి దిగన టీమిండియాలో మొదట్లోనే షాక్ తగిలింది. భారత్ 20 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ భారత స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. నిలకడగా ఆడుతూ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు 69 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
