Water War: వాటాల్లో తేలని లెక్కలు.. మీటింగ్‌ నుంచి వాకౌట్ చేసిన తెలంగాణ అధికారులు

|

Sep 01, 2021 | 6:24 PM

వాటాల్లో లెక్కలు తేలలేదు. వాటర్ వార్ కంటిన్యూ అవుతోంది. జలసౌధలో సుదీర్ఘంగా సాగిన KRMB మీటింగ్‌నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. కృష్ణా జలాల్లో..

Water War: వాటాల్లో తేలని లెక్కలు.. మీటింగ్‌ నుంచి వాకౌట్ చేసిన తెలంగాణ అధికారులు
Telugu States Water War
Follow us on

వాటాల్లో లెక్కలు తేలలేదు. వాటర్ వార్ కంటిన్యూ అవుతోంది. జలసౌధలో సుదీర్ఘంగా సాగిన KRMB మీటింగ్‌నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం పట్టుబట్టింది తెలంగాణ. గతంలో ఏపీ, తెలంగాణ మధ్య జరిగిన 512 : 219 TMCల నీటి పంపిణీ తాత్కాలికమేనని అధికారులు వాదించారు. కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా మాత్రమే అంగీకారం కుదిరిందని చెప్పారు..ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పూర్తయ్యాయని…నీటి వినియోగం పెరిగిందని వాదనలు వినిపించారు.. ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని డిమాండ్ చేసారు.. ఏపీ ప్రతిపాదించిన 70:30 నిష్పత్తిని అంగీకరించమని స్పష్టం చేశారు..

తెలంగాణ వాదనలకు కౌంటర్ ఇచ్చింది ఏపీ. 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీకి ససేమిరా అంది. 70:30 ఫార్ములానే ఫాలో కావాలని డిమాండ్ చేసింది. . అటు విద్యుత్ ఉత్పత్తిపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో పవర్‌ జనరేషన్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.. మొత్తంగా 10 అంశాలపై వాదనలు వినిపించార ఏపీ అధికారులు.

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ.. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొత్తానికి నీటి లెక్కలు, ప్రాజెక్టులు, విద్యుత్‌ ఉత్పత్తిపై ఎవరి వాదనలకు వారే కట్టుబడటంతో ఎడతెగని పంచాయితీ కొనసాగింది.. చివరికి తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

ఇవి కూడా చదవండి:  Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..

Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు వరుస ఎదురుదెబ్బలు.. తాజాగా 350 మంది హతం.. కీలక ప్రకటన చేసిన నార్తర్న్‌ అలయెన్స్‌..