Hyderabad: నిమిషాల్లో నయం చేస్తానన్నాడు.. మత్తు మందు ఇచ్చి ఒంటిపై నగలు, ఫోన్‌తో పరార్‌..!

|

Jun 09, 2023 | 12:35 PM

తానో పెద్ద వైద్యుడనని, ఏ రోగాన్నైనా చిటికెలో నయం చేస్తానని ఓ మహిళను నమ్మించాడు. అతని మాయమాటలు నమ్మిన ఓ మహిళ నకిలీ డాక్టర్‌ వద్దకు వైద్యం కోసం వెళ్లింది. మహిళకు మత్తు మందు ఇచ్చి, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే..

Hyderabad: నిమిషాల్లో నయం చేస్తానన్నాడు.. మత్తు మందు ఇచ్చి ఒంటిపై నగలు, ఫోన్‌తో పరార్‌..!
Fake Doctor
Follow us on

హైదరాబాద్‌: తానో పెద్ద వైద్యుడనని, ఏ రోగాన్నైనా చిటికెలో నయం చేస్తానని ఓ మహిళను నమ్మించాడు. అతని మాయమాటలు నమ్మిన ఓ మహిళ నకిలీ డాక్టర్‌ వద్దకు వైద్యం కోసం వెళ్లింది. మహిళకు మత్తు మందు ఇచ్చి, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే చేతివాటం చూపాడు. ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. హైదరాబాద్‌లో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..

తూర్పుగోదావరి జిల్లా, పీఠాపురం ప్రాంతానికి చెందిన నూకల సుజాత (50) కేపీహెచ్‌బీలోని పీజేఆర్‌ కాలనీలో ఉంటుంది. ఈనెల 2న ఆమె బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హజరయ్యేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రైలులో పీఠాపురానికి బయలుదేరింది. అదే రైల్లో పరిచమైన ఓ వ్యక్తి తాను హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో వైద్యుడినని, పని నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు వెళ్తున్నానని నమ్మబలికాడు. నకిలీ వైద్యుడి బూటకపు మాటలు నమ్మిన సుజాత, తన ఆరోగ్య సమస్యల గూర్చి అతనికి తెల్పింది. సిటీకి వచ్చాక ఆమెకు వైద్యం చేస్తానని చెప్పి, సుజాత సెల్‌ నంబర్‌ తీసుకొని రైలు దిగి వెళ్లిపోయాడు. ఈనెల 6న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి.. 7న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగింది.

సుజాతకు నకిలీ వైద్యుడు ఫోన్‌చేసి, తన అడ్రస్ చెప్పాడు. అడ్రస్‌ ప్రకారం సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌ గురుద్వారా మందిర్‌ వెనుక భాగంలో ఉన్న సాయి వినాయక లాడ్జిలో ఓ గదికి సుజాత వెళ్లింది. అక్కడే ఉన్న నకిలీ డాక్టర్‌ కొన్ని మత్తు మందులను ఆమెకు ఇచ్చి వేసుకోన్నాడు. ఆమె మందులను వేసుకోగానే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సుజాత మెడలోని 10 గ్రాముల గోల్డ్‌ చైన్‌, ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకొని నకిలీ డాక్టర్‌ పరారయ్యాడు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో స్పృహలోకి వచ్చిన సుజాతకు గదిలో ఎవరూ కనిపించలేదు. తన సెల్‌ఫోన్‌, గోల్డ్‌ చైన్‌ కూడా కనిపించలేదు. ఎంతకీ నకిలీ డాక్టర్‌ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు గోపాలపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.