Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరో ఫ్లైఓవర్‌..

Hyderabad: విశ్వనగరంగా హైదరాబాద్‌ మార్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్‌ను సిగ్నల్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో నగర వ్యాప్తంగా ఇప్పటికే పలు ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రజల కోసం అందుబాటులోకి రానుంది...

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరో ఫ్లైఓవర్‌..
Hyderabad Flyover
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 18, 2022 | 4:54 PM

Hyderabad: విశ్వనగరంగా హైదరాబాద్‌ మార్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్‌ను సిగ్నల్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో నగర వ్యాప్తంగా ఇప్పటికే పలు ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రజల కోసం అందుబాటులోకి రానుంది. నగరంలోని అన్ని ప్రాంతాలతో సమానంగా పాత బస్తీలోనూ పలు ఫ్లైఓవర్‌లు నిర్మిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే అబ్దుల్ కలాం ఆజాద్, బైరమల్ గూడ ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇక తాజాగా రేపటి నుంచి (మంగళవారం) బహదూర్ పుర ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఏప్రిల్‌ 19 రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే పాత బస్తీ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడనుంది. తూర్పు ప్రాంతం నుంచి శంషాబాద్, శంషాబాద్ నుంచి తూర్పు ప్రాంతానికి వెళ్లే వరకు చాలా సులభంగా గమ్య స్థానాలను చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం, భూసేకరణ కోసం రూ. 108 కోట్లు ఖర్చు చేశారు. 13 పిల్లర్స్‌, ఇరు వైపులా సర్వీస్‌ రోడ్డు, సైడ్‌ డ్రెయిన్లు నిర్మించారు. ఇక ఫైఓవర్‌ కింది భాగంలో కూడా సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్‌ ద్వారా ఆరాంఘర్‌ నుంచి ఉప్పల్‌ వరకు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సకాలంలో గమ్యాన్ని చేరుకోవచ్చు. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తుండడంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Hyd

ఇదిలా ఉంటే హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా ఎస్‌.ఆర్‌.డి.పి, సి.ఆర్‌.ఎంపి ద్వారా రోడ్ల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి దశలో భాగంగా చేపట్టిన 47 పనులలో సుమారు 30 పనులు పూర్తి కాగా అందులో 13 ఫ్లైఓవర్ లు, 7 అండర్ పాసులు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో పెరుగుతోన్న ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ఈ నిర్మాణాలు ఉపయోగపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Hyd1

Also Read: INDBank Recruitment: ఇండ్‌బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 10 లక్షల వరకు జీతం పొందే అవకాశం..

Bandi Sanjay Yatra: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత.. ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

Kadapa: షాకింగ్ ఇన్సిడెంట్.. ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్‌టాప్ బ్లాస్ట్‌.. పాపం యువతి