Bandi Sanjay Yatra: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత.. ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తిత నెలకొంది.

Bandi Sanjay Yatra: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత.. ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
Bandi Sanjay
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 18, 2022 | 1:02 PM

BJP vs TRS: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్(Bandi Sanjay Kumar) ఐదో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తిత నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద పాదయాత్ర ప్రారంభం కాగానే.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బండి సంజయ్‌తో పాటు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు.. కొంత మంది కార్యకర్తలు కిందపడిపోయారు. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. బిజెపి కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కొట్టడానికి దూసుకెళ్లారు.చివరకు డీకే అరుణ ఎంటర్‌ అయి కార్యకర్తలను శాంతింప జేశారు

కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుని వేరే ప్రదేశానికి తరలించారు. తమ పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించడంపై బీజేపీశ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ కలుగజేసుకొని తమ కార్యకర్తలను శాంతింపజేయడంతో.. తిరిగి పాదయాత్ర కొనసాగింది.

Read Also…  Prashant Kishor: అక్కడ దోస్తీ.. ఇక్కడ కుస్తీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్‌తో పరేషాన్!