AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashant Kishor: అక్కడ దోస్తీ.. ఇక్కడ కుస్తీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్‌తో పరేషాన్!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గాంధీలతో సహా కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కావడం ఆ పార్టీ తెలంగాణ శాఖను ఇరుకున పెట్టింది.

Prashant Kishor: అక్కడ దోస్తీ.. ఇక్కడ కుస్తీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్‌తో పరేషాన్!
Prashant Kishor Revanth Reddy
TV9 Telugu
| Edited By: |

Updated on: Apr 18, 2022 | 12:44 PM

Share

Telangana Congress: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. సోనియా, రాహుల్ గాంధీలతో సహా కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కావడం ఆ పార్టీ తెలంగాణ శాఖను ఇరుకున పెట్టింది. కిషోర్ కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజెంటేషన్ ఇచ్చారుమరియు అతని సూచనలను పరిశీలించడానికి ఒక కమిటీని నియమిస్తానని పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కిషోర్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఆయన భేటీ అయినట్లు సమాచారం. శనివారం సోనియాగాంధీ సహా ఏఐసీసీ ముఖ్య నేతలతో పీకే సమావేశం కావడంతో ఆయన హస్తం గూటికి చేరడం ఖాయమైంది. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీకి ప్రయోజనం కల్గుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తుండగా… టీపీసీసీలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పీకే ఎంట్రీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాకింగ్ అనే చర్చ సాగుతోంది.

ఇటు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం కేసీఆర్‌పైనా, ఆయన ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నిజానికి కిషోర్ అని పిలుచుకునే పీకే రాష్ట్రంలో ఏమీ చేయలేరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అన్నట్లు వార్తలు వచ్చాయి. యాదృచ్ఛికంగా, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ ఆదివారం ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందనే వదంతులు పూర్తిగా అవాస్తవమన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి తెలంగాణను కాపాడేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు..

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేసీఆర్ టార్గెట్​గా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. జిల్లాలు చుట్టేస్తూ కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. రేవంత్ స్పీడ్ తో ఆయన వర్గీయులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే సడెన్​గా రేవంత్ రెడ్డి శిబిరంలో అలజడి నెలకొంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సమావేశం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్‌కు , టీఆర్ఎస్‌కు పొలిటికల్ అనలిస్టుగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. గులాబీ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పీకే టీమ్ సర్వేలు చేస్తున్నాయి. ఎప్పటికప్పడు కేసీఆర్​కు నివేదికలు ఇస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియా సాక్షిగా కేసీఆర్ కూడా ప్రకటించారు. అదే సమయంలో పీకేను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆయనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీకేలు ఏమి పీకలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి పీకేలు అవసరం లేదని.. 40 లక్షల మంది ఏకే 47 లాంటి కార్యకర్తలు ఉన్నారని అన్నారు. పీకేలు ఏమి పీకలేరంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేయగా.. ఇప్పుడే అతనే కాంగ్రెస్ వ్యూహకర్తగా ఉండబోతున్నారు. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. పీకేపై గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. దీనికి కౌంటర్ ఇవ్వలేక రేవంత్ రెడ్డి టీమ్ తంటాలు పడుతోందని తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ వ్యూహకర్తగా పీకే ఉంటారన్న వార్తలతో తెలంగాణలో మరో చర్చ కూడా తెరపైకి వచ్చింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వ్యూహాత్మక కూటములను ఏర్పాటు చేసుకోవాలని సోనియాకు పీకే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. పీకే లెక్కన తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్​తో మంచి సంబంధాలున్న పీకే.. ఈ రెండు పార్టీల మధ్య సయోధ్యకు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, కారు పార్టీల పొత్తు అసాధ్యమేమి కాదంటున్నారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటున్నా.. ఎన్నికల వరకు ఏదైనా జరగవచ్చని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్- టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే.. కేసీఆర్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్న రేవంత్ పరిస్థితి ఏంటన్నది చర్చగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే.. రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రేవంత్ అనుచరులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Also….  Yati Satyadevanand Saraswati: హిందువుల జనాభాపై యతి సత్యదేవానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు..!