Yati Satyadevanand Saraswati: హిందువుల జనాభాపై యతి సత్యదేవానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు..!
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో యతి సత్యదేవానంద సరస్వతి వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న ముస్లింల జనాభా హిందువుల క్షీణతను సూచిస్తోందన్నారు.
Yati Satyadevanand Saraswati Comments: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని ఉనా జిల్లాలో యతి సత్యదేవానంద సరస్వతి వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న ముస్లింల జనాభా హిందువుల క్షీణతను సూచిస్తోందన్నారు. అటువంటి పరిస్థితిలో, భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా హిందువులు తమ కుటుంబాలను బలోపేతం చేస్తే, వారు తమ కుటుంబాన్ని, మానవత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బందోబస్తు కోసం భారీ పోలీసు బలగాలను మోహరించారు.
హిమాచల్ ప్రదేశ్ ఆల్ ఇండియా సంత్ పరిషత్ ఇన్‌చార్జి యతి సత్యదేవానంద సరస్వతి మాట్లాడుతూ, భారతదేశం హిందూ మెజారిటీ ఉన్నందున ప్రజాస్వామ్య దేశమని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలోని ముబారక్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరుగుతున్న ధర్మ సంసద్‌లో భాగంగా ముస్లింలు ప్రణాళికాబద్ధంగా అనేక మంది పిల్లలకు జన్మనిస్తూ తమ జనాభాను పెంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో భారత్ ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండేందుకు హిందువులు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని మా సంస్థ కోరిందని సరస్వతి తెలిపారు.
అయితే, ఏ మతాన్ని రెచ్చగొట్టే పదజాలం ఉపయోగించవద్దని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు సరస్వతికి నోటీసులు జారీ చేశారు. ఉనా జిల్లాలోని అంబ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నోటీసు జారీ చేస్తూ, అటువంటి సూచనలను పాటించకపోతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలావుంటే, మూడు రోజుల పాటు జరుగుతున్న ధర్మ సంసద్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. మూడు పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో మతమన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డిసి రాఘవశర్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టు పిటిషనర్ తనతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారన్నారు. దీని తరువాత, గట్టి భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం అఖిల భారతీయ సంత్ పరిషత్ మూడు రోజుల మతాల పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా, మహామండలేశ్వర యేటి నరసింహానంద సరస్వతి మీడియాతో సంభాషణలో ఒక నిర్దిష్ట వర్గంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో, అతను హిందువులను ఎక్కువ మంది పిల్లలను పుట్టించాలని, వారి కుటుంబాలను సురక్షితంగా ఉంచడానికి, రక్షించడానికి ఆయుధాలను చేపట్టాలని కోరారు. హిందువులుగా మారకుండా ఉండేందుకు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని అభ్యర్థించారు.
మరోవైపు, హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగం కేసులో బెయిల్‌పై ఉన్న మహంత్, రాబోయే దశాబ్దాల్లో దేశం హిందువులు హీనంగా మారకుండా నిరోధించడానికి ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని మధురలో ఈనెల మొదటి వారంలో జరిగిన సత్ సంఘ్ సమావేశంలో హిందువులను కోరారు. హిందూ మెజారిటీ ఉన్నందున భారతదేశం ప్రజాస్వామ్య దేశమని అఖిల భారతీయ సంత్ పరిషత్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ ఏటి సత్యదేవానంద సరస్వతి అన్నారు.
Read Also… Hindi Jobs: మీకు హిందీ తెలిస్తే చాలు పంట పండినట్లే.. ఆ దేశాల్లో లక్షల్లో జీతాలు..