Hyderabad: అద్దె ఇళ్ల కోసం నెట్టింట్లో వెతుకులాట.. ఆ ప్రాంతాల్లో భారీ డిమాండ్

కరోనా, వర్క్ ఫ్రం హోం(Work From Home) కారణంగా స్వస్థలాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా నగరబాట పడుతున్నారు. ఓ వైపు ఉద్యోగ ప్రకటనలు, మరోవైపు వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ అంటూ కంపెనీలు పిలుపునివ్వడంతో ఉద్యోగులు, నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్....

Hyderabad: అద్దె ఇళ్ల కోసం నెట్టింట్లో వెతుకులాట.. ఆ ప్రాంతాల్లో భారీ డిమాండ్
To Let Board
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 18, 2022 | 4:12 PM

కరోనా, వర్క్ ఫ్రం హోం(Work From Home) కారణంగా స్వస్థలాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా నగరబాట పడుతున్నారు. ఓ వైపు ఉద్యోగ ప్రకటనలు, మరోవైపు వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ అంటూ కంపెనీలు పిలుపునివ్వడంతో ఉద్యోగులు, నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్ వస్తున్నారు. కొంతకాలంగా ఖాళీగా ఉన్న అమీర్‌పేట్‌(Ameerpet) , మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లో మళ్లీ సందడి మొదలైంది. ఇన్నాళ్లు టూలెట్‌(To-Let) బోర్టులతో దర్శనమిచ్చిన ఇళ్లన్నీ నిండిపోయాయి. కొన్ని కంపెనీలు ఏప్రిల్‌ 15 లోగా ఆఫీస్ లకు రావాల్సిందేనని కారఖండీ గా చెప్పేశాయి. దీంతో కొందరు ఇప్పటికే ఉద్యోగంలో చేరిపోగా, మరికొందరు అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్నారు. ఫలితంగా అద్దె ఇళ్లకు, హాస్టళ్లకు డిమాండ్‌ పెరిగింది. రెండేళ్లుగా ఎలాంటి ఆదాయం రాకపోవడంతో కొందరు అపార్ట్‌మెంట్ల యజమానులు అద్దెలను 15-20 శాతం పెంచారు. నిరుద్యోగ అభ్యర్థులు ఎక్కువగా ఉండే అమీర్‌పేట్‌, అశోక్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలోని మాణికేశ్వర్‌నగర్‌, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో అద్దెలు పెరిగాయి.

అయితే.. రోజంతా అద్దె ఇళ్ల కోసం తిరిగే పరిస్థితి మారింది. ఇందుకు నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. అద్దె ఇళ్ల వివరాలు తెలుసుకుంటున్నారు. కరోనా అనంతరం రెంటల్‌ రంగం పుంజుకుంటోందని నో బ్రోకర్‌.కామ్‌ తన అధ్యయనంలో వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు ఇతర మెట్రో నగరాల్లోనూ పూర్వ స్థితి కనిపిస్తోందని తెలిపింది. అద్దె కోసం నెట్టింట వెతుకుతున్నారని తెలిపింది. బేగంపేట్‌, ఎస్సార్‌నగర్‌, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, మణికొండ ప్రాంతాల్లో అద్దెల కోసం డిమాండ్‌ పెరిగింది.

Also Read

TTD News: తిరుమల లడ్డూ తయారీలో “క్లీన్ కుకింగ్”.. ఇంధన ఆదా కోసం టీటీడీ నిర్ణయం

Royol Bengal Tiger: బోట్‌లో తరలిస్తుండగా నీటిలో దూకిన పులి.. వైరల్‌గా మారిన వీడియో..

Viral Video: హింస కేసు నిందితుడి కండ కావరం.. కోర్టు లోపలికి వెళ్తూ.. ‘తగ్గేది లే’ అంటూ సిగ్నల్