రోలర్ స్కేటింగ్‌లో తెలంగాణ కుర్రాడు సత్తా.. ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్.. ఔరా అనిపించే వీడియో.!

| Edited By: Srilakshmi C

Oct 30, 2023 | 3:56 PM

స్కేటింగ్.. ప్రస్తుతం ఉన్న జనరేషన్ పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి ఆట అని చెప్పొచ్చు. స్కేటింగ్ చేస్తూ పాములాగా మెలికలు తిరుగుతూ ముందుకెళ్తుంటారు ఈ ఆటలో.. కానీ స్కేటింగ్ చేయడం ఎంతో కష్టం ఏమాత్రం బ్యాలన్స్ అదుపు తప్పిన పెద్ద ప్రమాదమే జరుగుతుంది.. సహజంగా ఈ స్కేటింగ్ చేయాలి అంటే కాళ్ళకి ఎంతో పని పెట్టాలి. అంతేకాకుండా మెదడును సైతం తమ కంట్రోల్ లో ఉంచుకొని ఏకాగ్రతతో ముందుకెళ్లాలి. చేతులతో ఏమాత్రం ముట్టుకోకుండా కేవలం కాళ్లతో..

రోలర్ స్కేటింగ్‌లో తెలంగాణ కుర్రాడు సత్తా.. ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్.. ఔరా అనిపించే వీడియో.!
Solo Dance Roller Skating
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: స్కేటింగ్.. ప్రస్తుతం ఉన్న జనరేషన్ పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి ఆట అని చెప్పొచ్చు. స్కేటింగ్ చేస్తూ పాములాగా మెలికలు తిరుగుతూ ముందుకెళ్తుంటారు ఈ ఆటలో.. కానీ స్కేటింగ్ చేయడం ఎంతో కష్టం ఏమాత్రం బ్యాలన్స్ అదుపు తప్పిన పెద్ద ప్రమాదమే జరుగుతుంది.. సహజంగా ఈ స్కేటింగ్ చేయాలి అంటే కాళ్ళకి ఎంతో పని పెట్టాలి. అంతేకాకుండా మెదడును సైతం తమ కంట్రోల్ లో ఉంచుకొని ఏకాగ్రతతో ముందుకెళ్లాలి. చేతులతో ఏమాత్రం ముట్టుకోకుండా కేవలం కాళ్లతో మాత్రమే ఈ సాహసం చేయాల్సి ఉంటుంది. అలా స్కేటింగ్ చేస్తున్న వారిని చూస్తే వన్నులో వణుకు పుట్టాల్సిందే. కానీ ఆ స్కేటింగ్‌లో వినూత్నంగా డాన్సులు చేస్తూ చైనాలో జరిగిన ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌ మొట్ట మొదటిసారిగా గోల్డ్ మెడల్ ను సాధించి ఔరా అనిపించాడు మన హైదరాబాద్ కుర్రోడు జుహిత్.

హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లి కి చెందిన సంధ్యారాణి, సునీల్ కుమార్ (డాక్టర్) దంపతులకు కవల పిల్లలు (బాబు-పాప) జుహిత్, జునాలి… ప్రస్తుతం ఈ ఇద్దరు నాచారం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు.. చిన్నప్పటి నుండి జుహిత్ కు స్కేటింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇక జునాలికి చిత్రలేఖనంపై మంచి అభిరుచి ఉంది. జుహిత్ కి ఉన్నటువంటి ఇష్టాన్ని గమనించినటువంటి తల్లితండ్రులు స్కేటింగ్ లో శిక్షణను అందించారు. నాలుగు సంవత్సరాల వయసు అప్పటి నుంచి జూహిత్ స్కేటింగ్లో శిక్షణను తీసుకున్నాడు. 2022 గుజరాత్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ లో జుహిత్ బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు. అతను మూడవ తరగతి చదువుతున్నప్పటి నుండి ఈనాటి వరకు స్కాలర్షిప్ తోనే చదువును కొనసాగిస్తున్నాడు.

2017 నుండి నేషనల్ స్కేటింగ్ లో గోల్డ్ మెడలను సాధించిన జుహీత్ ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూడకుండా 50 గోల్డ్ మెడల్స్ ను జిల్లా స్థాయి నుంచి ఛాంపియన్షిప్స్ వరకు గెలుపొందాడు.. అయితే తాజాగా 19వ చైనా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌ 2023 జుహిత్ (Juhith) గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో స్కేటింగ్ సోలో డాన్స్ లో తెలంగాణ నుండి మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న కుర్రాడిగా పేరందుకున్నాడు. జుహీత్ కు అర్జున్ అవార్డు గ్రహీత అయినటువంటి అనూప్ కుమార్, అమర్‌నాగ్ కోచ్ లుగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

 

చిన్నప్పటి నుంచి ఉన్నటు వంటి ఇష్టం, ప్యాషన్ వలన ఈరోజు ఇంతటి ఘనత సాధించగలిగాడు అని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జూహిత్ చదువులో కూడా తక్కువేమీ కాదు. ఎప్పుడు స్కేటింగ్ మీదనే కాకుండా చదువులోనూ స్కాలర్షిప్ తో ముందుకెళ్తూ 95% మార్కులతో టాపర్ గా నిలిచేవాడు. అయితే ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలన్నదే తన కల అని అంటున్నాడు జుహిత్. ఒక వైపు చదువులో ఒకవైపు ఆటల్లో తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకుని ప్రస్తుతం ఉన్న జనరేషన్ పిల్లలకు ఆదర్శంగా మన హైదరాబాది కుర్రోడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.