KTR: మంత్రి కేటీఆర్‌ను కదిలించిన ఓ తల్లి లేఖ.. ఆ విషయంలో చిన్నారులకు మినహాయింపు ఇవ్వాలంటూ..

KTR: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మొదటి వరుసలో ఉంటారు. ప్రజల ఇబ్బందులు, సమస్యలపై ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ వేదికగా స్పందించే మంత్రి.. వారి సమస్యలను కూడా అక్కడిక్కడే...

KTR: మంత్రి కేటీఆర్‌ను కదిలించిన ఓ తల్లి లేఖ.. ఆ విషయంలో చిన్నారులకు మినహాయింపు ఇవ్వాలంటూ..
Ktr
Follow us

|

Updated on: Sep 19, 2022 | 11:04 AM

KTR: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మొదటి వరుసలో ఉంటారు. ప్రజల ఇబ్బందులు, సమస్యలపై ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ వేదికగా స్పందించే మంత్రి.. వారి సమస్యలను కూడా అక్కడిక్కడే పరిష్కరిస్తుంటారు. వెంటనే యాక్షన్‌ తీసుకోమని సంబంధిత అధికారులకు అక్కడిక్కడే ఆదేశాలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్‌ను ఓ తల్లి రాసిన లేఖ కదిలించింది. సదరు లేఖపై వెంటనే స్పందించిన మంత్రి ట్విట్టర్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఇంతకీ ఆ తల్లి రాసిన లేఖలో ఏముంది.? మంత్రి ఏమని స్పందించారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

హైదరాబాద్‌కు చెందిన ఓ తల్లి తన ఐదేళ్ల కొడుకుతో ఇటీవల జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పర్క్‌ను సందర్శించడానికి వెళ్లారు. అదే సమయంలో పార్క్‌లో ఉన్న నెమళ్ల నుంచి భూమిపై జారి పడిన ఈకలను తీసుకున్న ఆ కుర్రాడు వాటితో బయటకు వచ్చాడు. అయితే గేట్‌ వద్ద ఉన్న సెక్యూరిటీ ఆ కుర్రాడిని అడ్డుకుని, ఈకలను తీసుకెళ్లడాన్ని నిరాకరించారు. ఫారెస్ట్‌ చట్టం ప్రకారం జాతీయ పక్షి అయిన నెమలిని చంపడం కానీ, బాధించడం కానీ చట్టరీత్య నేరమని చెప్పి ఈకలను తిరిగి తీసేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ ఆ కుర్రాడి తల్లి ఓ లేఖ రాసింది.

ఇవి కూడా చదవండి

జారిపడిన ఈకలను తీసుకోవడం జాతీయ పక్షిని బాధించడం ఎలా అవుతుంది.? నెమలి ఈకలు అలా పాడైపోవడం కంటే చిన్నారుల సంతోషానికి కారణం అవ్వడం తప్పు కాదు కదా అంటూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ లేఖ కాస్త మంత్రి కేటీఆర్‌ దృష్టిలో పడింది. దీంతో సదరు తల్లి రాసిన లేఖను ట్వీట్‌చేస్తూ.. ‘ఓ చిన్నారి తల్లి రాసిన ఈ లేఖ కదిలించింది. పార్క్‌లో పడిపోయిన నెమలి ఈకలను తీసుకెళ్లేందుకు చిన్నారులకు అనుమతి ఇవ్వాలని కేబీఆర్‌ పార్క్‌ అధికారులను నేను కోరుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌ అవుతోంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం