TSPSC Group 1 Exam: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు ‘నో’.. జూన్‌ 11న పరీక్ష యథాతథం

|

Jun 05, 2023 | 3:37 PM

టీఎస్‌పీఎస్సీ ఈనెల 11 నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాక‌రించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీకి..

TSPSC Group 1 Exam: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నో.. జూన్‌ 11న పరీక్ష యథాతథం
TSPSC Group 1 Exam
Follow us on

టీఎస్‌పీఎస్సీ ఈనెల 11 నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాక‌రించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యేంత వరకు గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. వీటిని విచారించిన హైకోర్టు ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

కాగా ప్రశ్నప‌త్రాల లీకేజీల నేప‌థ్యంలో గతేడాది అక్టోబ‌ర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్షను టీఎస్‌పీఎస్సీ ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌కు మ‌రోసారి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పట్లు చేశారు. హాల్‌ టికెట్లు కూడా కమిషన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో పరీక్షను వాయిదా వేయాలంటూ హైకోర్టులో కొందరు అభ్యర్ధులు పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్ష నిర్వహణపై స్టే ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాల‌న్న ధర్మాసనం పిటిష‌న్లను కొట్టివేసింది.

దీంతో జూన్‌ 11న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష యథాతథంగా జరగనుంది. కాగా, 503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.