Telangana: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ ఫేజ్ – 2 కు వేగంగా అడుగులు..

|

Nov 27, 2022 | 6:39 AM

హైదరాబాద్ మహా నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజా రవాణాను అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే సిటీ బస్సులు, మెట్రోలు, లోకల్ రైళ్లు సేవలు అందిస్తుండగా.. ఎంఎంటీఎస్ అయిన..

Telangana: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ ఫేజ్ - 2 కు వేగంగా అడుగులు..
Hyderabad MMTS
Follow us on

హైదరాబాద్ మహా నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజా రవాణాను అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే సిటీ బస్సులు, మెట్రోలు, లోకల్ రైళ్లు సేవలు అందిస్తుండగా.. ఎంఎంటీఎస్ అయిన లోకల్ రైళ్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ ముందడుగులు వేస్తోంది. ఫేజ్‌-2 పనులు ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ క్రమంలో రూ.200 కోట్లు నిధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి ప్రాజెక్టు. దీనికి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రెండో దశ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.816 కోట్లు కేటాయించింది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.179 కోట్లు విడుదల చేయగా, ఇప్పుడు రూ.200 కోట్లు విడుదల చేసేందుకు ఆదేశించింది.
మౌలాలి – ఘట్‌కేసర్‌ మధ్య ఉన్న 12.20 కిలోమీటర్ల దూరంలో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఫలక్‌నుమా – ఉందానగర్‌ సెక్షన్ లోని 13.5 + 6.5 కిలోమీటర్లు (రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు) డబ్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు కంప్లీట్ అయ్యాయి.

సికింద్రాబాద్‌-బొల్లారం మధ్య 14 కిలోమీటర్లకు సంబంధించి డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు కొంత పూర్తి చేశారు. బొల్లారం – మేడ్చల్‌ స్టేషన్ల మధ్య 14 కిలోమీటర్ల వరకు డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. సనత్‌నగర్‌ – మౌలాలి స్టేషన్ల మధ్య 22.10 కిలోమీటర్ల మేరకు డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. మౌలాలి – మల్కాజిగిరి – సీతాఫల్‌ మండి స్టేషన్ల మధ్య 10 కిలోమీటర్ల దూరంలో డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది.

తెల్లాపూర్‌ -రామచంద్రాపురం స్టేషన్ల మధ్య 5.75 కిలోమీటర్లు మార్గం డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు రెండో దశ లో భాగంగా కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మౌలాలి – సనత్‌నగర్‌ మార్గంలో ఫిరోజ్‌గూడ, సుచిత్ర సెంటర్‌, భువ్‌దేవ్‌ నగర్‌, నేరేడ్‌మెంట్‌తో పాటు మౌలాలి హెచ్‌డీ కాలనీ స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..