Hyderabad: నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు.. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ మెమోలతో..

హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ముద్దం స్వామీ ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన బీటెక్, డిగ్రీ, పీజీకి చెందిన డూప్లికేట్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు.

Hyderabad: నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు.. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ మెమోలతో..
Fake Certificate
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 11, 2022 | 1:34 PM

Fake certificates: ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ మార్క్స్ మెమోలు నకిలీవి తయారు చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ సర్టిఫికేట్స్ సృష్టించి అమాయకుల నుంచి లక్షల్లో సొమ్ముచేసుకుంటున్న ముఠా గుట్టును రట్టుచేశారు. నకిలీ సర్టిఫికెట్ల దందాలో పాలుపంచుకున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ముద్దం స్వామీ ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన బీటెక్, డిగ్రీ, పీజీకి చెందిన డూప్లికేట్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. కొంత కాలంగా ఫారెన్ కు వెళ్లాలనుకునే వారికి నకిలీ బీటెక్ సర్టిఫికెట్లను తయారీ చేసి ఇచ్చి.. వారి నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నాడు. నాచారానికి చెందిన దయాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర 50వేలు తీసుకొని డుప్లికేట్ బీటెక్ సర్టిఫికేట్స్ సృష్టించి వీసాకు అప్లై చేయించాడు.

అయితే.. ఇంటర్వ్యూలో సర్టిఫికేట్స్ నకిలీవని తేడంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. దయాకర్‌ను అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు ముద్దం స్వామి కూడా డూప్లికేట్ సర్టిఫికేట్స్‌తో అమెరికాలోని పేస్ యూనివర్సిటీ అఫ్ న్యూయార్క్‌లో ఎంబీఏ చదువుతున్నట్లు గుర్తించారు. నిందితుడు పై 476, 471, 420 ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్ట్‌గేషన్ చేస్తున్నారు. అమెరికా ఎంబసీకి సమాచారం ఇచ్చి ముద్దం స్వామిని ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ కూపి లాగి డ్యూప్లికేట్ సర్టిఫికేట్ల దందాకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!