Hyderabad: విధి వక్రించడం అంటే ఇదేనేమో.. క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరకు
Hyderabad: మరణం అనేది ఏ సమయంలో సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఎంతో మంది అనుకోకుండా మృత్యు ఒడిలోకి వెళ్లిన సంఘటనలను చూస్తూనే ఉంటాము. కొందరు ..
Hyderabad: మరణం అనేది ఏ సమయంలో సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఎంతో మంది అనుకోకుండా మృత్యు ఒడిలోకి వెళ్లిన సంఘటనలను చూస్తూనే ఉంటాము. కొందరు అనారోగ్యం కారణంగా మృతి చెందితే.. మరి కొందరు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంటారు. ఇలా అనుకోకుండా కుప్పకూలిపోయి చనిపోయిన వారు ఎక్కువగా గుండెపోటుతోనే మరణించి ఉంటారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
గుజరాత్‌కు చెందిన తుస్సార్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లోని సన్‌సిటీ ఎస్‌బీఐ మైదానంలో తుస్సార్ క్రికెట్ ఆడుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుస్సార్ మరణించాడు. విషయమై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తుస్సార్ గుండెపోటుతో మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
గుండెపోటు ఎందుకు వస్తుంది..?
ఇలా చాలా మంది ఆటలాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘటనలను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. గుండెపోటుతోనే కుప్పకూలడం జరుగుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. కొందరు ఫిట్‌గా ఉన్న వారిలో గుండెపోటు సంభవిస్తుంటుంది. వారి జీవనశైలి విధానంలో మార్పుల కారణంగా కూడా గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కుటుంబ చరిత్ర కారణంగా కూడా గుండెపోటు సంభవించే ప్రమాదం ఉందని, ఇంట్లో ఒక వ్యక్తికి గుండెపోటు ఉంటే వారి పిల్లలకు కూడా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మద్యం, ధూమపానం అలవాటు ఉన్నవారిలో ఈ గుండెపోటు ఎక్కువగా ఉంటుందని, అలాగే తీవ్ర ఒత్తిడి కారణంగా కూడా గుండెపోటు లక్షణాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
అలాగే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని, అయితే గుండెకు నిరంతరాయంగా రక్తం సరఫరా జరుగుతుండాలి. ఒక వేళ గుండెకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినా ప్రమాదమే. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ రక్తనాళాల ఇరువైపులా పేరుకుపోవడం కారణంగా రక్తం సరఫరా కావడంతో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో రక్తం సరఫరా అయ్యే మార్గంలో ఇబ్బందులు తలెత్తి గుండెపోటుతో మరణం సంభవించవచ్చు. ఇలా రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు మనిషి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడతాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి