Viral Video: ఈ దొంగ స్టైలే వేరు.. దేవుడికి దణ్ణం పెట్టి మరీ నిలువు దోపిడీ చేసేశాడు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Viral Video: దేవుళ్ల శక్తిని విశ్వసించేవారు.. సాధారణంగానే ఆ దేవతలకు భయపడుతారు. తప్పు చేయాలంటే జంకుతారు. కానీ, కొందరుంటారు.. భక్తి భక్తే, భుక్తి భుక్తే అని పక్కా కమిట్మెంట్‌తో ఉంటారు. అలాంటి వాడే ఈ దొంగ.

Viral Video: ఈ దొంగ స్టైలే వేరు.. దేవుడికి దణ్ణం పెట్టి మరీ నిలువు దోపిడీ చేసేశాడు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Thieve
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 10, 2022 | 2:17 PM

Viral Video: దేవుళ్ల శక్తిని విశ్వసించేవారు.. సాధారణంగానే ఆ దేవతలకు భయపడుతారు. తప్పు చేయాలంటే జంకుతారు. కానీ, కొందరుంటారు.. భక్తి భక్తే, భుక్తి భుక్తే అని పక్కా కమిట్మెంట్‌తో ఉంటారు. అలాంటి వాడే ఈ దొంగ. దేవుడికి దణ్ణం పెట్టి మరీ దండుకున్నాడు. అవును, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ ఆలయంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ దొంగ.. చోరీకి ముందు అమ్మవారికి నమస్కారం చేశాడు. అనంతరం హుండీలను కొల్లగొట్టాడు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జబల్‌పూర్‌లోని సుఖా గ్రామంలో అమ్మవారి ఆలయం ఉంది. అర్థరాత్రి వేళ ఆలయం లోపలికి ప్రవేశించిన ఓ ముసుగు దొంగ.. తొలుత భయపడుతూనే అమ్మవారికి నమస్కరించాడు. ఆపై తాను వచ్చిన పని పూర్తి చేశాడు. మెల్లగా ఆలయంలో ఉన్న హుండీలన్నీ ఎత్తుకెళ్లాడు. అయితే, చోరీ అంతా గుడిలో అమర్చిన సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు 5న ఈ చోరీ జరుగగా.. దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. చోరీకి పాల్పడిన దుండగుడు.. అమ్మవారి గుడిలో రెండు పెద్ద గంటలు, హుండీలను ఎత్తుకెళ్లాడు. కాగా, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?