Andhra Pradesh: ‘నా చావుకు నేనే కారణం..’ వాట్సాప్ స్టేటస్ లో మెసేజ్.. అలర్ట్ అయిన పోలీసులు..కట్ చేస్తే
ఆత్మహత్యలు.. ఈ మధ్య సర్వసాధారణమైపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని, లవ్ ఫెయిల్ అయిందని, ఆర్థిక కష్టాలు...
ఆత్మహత్యలు.. ఈ మధ్య సర్వసాధారణమైపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని, లవ్ ఫెయిల్ అయిందని, ఆర్థిక కష్టాలు కలుగుతున్నాయని.. ఇలా కారణమేదైతేనేం. నిండు జీవితాన్ని క్షణికావేశంలో బలి తీసుకుంటున్నారు. సూసైడ్ చేసుకోవడం తప్పని చెబుతున్నప్పటికీ.. వాటిని పట్టించుకోవడం లేదు. మరోవైపు సోషల్ మీడియా (Social Media) వాడకం ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. బాధ కలిగినా, సంతోషం వచ్చినా వాట్సాప్ స్టేటస్ లు, ఫేస్ బుక్ స్టోరీస్ లలో పెట్టేస్తున్నారు. ఇంతకీ ఏ రెండింటికీ ఏంటి సంబంధం అంటారా.. ఉందండోయ్.. ఎందుకంటే ఓ యువకుడు పలు కారణాలతో ఆత్మహత్య (Suicide) చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతను తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. అది చూసిన అతని స్నేహితుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని సదరు యువకుడిని కాపాడడంతో సెన్సేషన్ కు తెర పడింది.
విశాఖపట్నం పితాని దిబ్బలో నివాసముంటున్న గోపాల్.. కొన్ని సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నా చావుకు నేనే కారణం అంటూ వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. అతని స్టేటస్ లో చూసిన గోపాల్ స్నేహితుడు దిలీప్ వెంటనే డయల్ 100 కు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన టూటౌన్ ఏఎస్సై అప్పారావు హుటాహుటిన స్పాట్ కు చేరుకున్నారు. అప్పటికే కత్తి పట్టుకుని ఉన్న గోపాల్ ను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం అతని స్నేహితుడు దిలీప్ ను పిలిపించి అతనికి గోపాల్ ను అప్పగించారు. సకాలంలో స్పందించిన పోలీసులను అభినందిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి