AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం.. 124 మందికి సోకిన వైరస్‌

తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 124 మందికి ఈ వైరస్‌ సోకింది. అటెండర్ నుంచి డీఐజీ స్థాయి వరకు పలువురికి కరోనా సోకింది. 

తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం.. 124 మందికి సోకిన వైరస్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2020 | 5:18 PM

Share

తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 124 మందికి ఈ వైరస్‌ సోకింది. అటెండర్ నుంచి డీఐజీ స్థాయి వరకు పలువురికి కరోనా సోకింది.  అకాడమీలో పనిచేసే ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీ, నలుగురు సీసీలతో సహా అక్కడున్న మెడికల్ సిబ్బంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వారందరినీ ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ అకాడమీలో 1900 కాడేట్‌లు శిక్షణ పొందుతుండగా.. వారికి త్వరలోనే పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 124 మందికి వైరస్ సోకడంతో అధికారులతో టెన్షన్ మొదలైంది. కాగా తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉండగా.. నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 13వేలను దాటేసింది. అందులో ఎక్కువగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉండటంతో అధికారుల్లో ఆందోళన ఎక్కువవుతోంది.

Follow Us