Hyderabad: ‘స్ట్రాంగా..? వీకా..? తేల్చేందుకు మ్యాచ్‌ కుదిర్చారా’.. టెకీతో 15 రోజుల సహజీవనం తర్వాత..

|

Jan 30, 2023 | 7:09 AM

సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో నిత్య పెళ్లికొడుకు బాగోతం బయటపడింది. బోయిన్‌పల్లికి చెందిన అక్కిరెడ్డి వంశీకృష్ణ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.

Hyderabad: ‘స్ట్రాంగా..? వీకా..? తేల్చేందుకు మ్యాచ్‌ కుదిర్చారా’.. టెకీతో 15 రోజుల సహజీవనం తర్వాత..
Hyderabad Crime News
Follow us on

సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో నిత్య పెళ్లికొడుకు బాగోతం బయటపడింది. బోయిన్‌పల్లికి చెందిన అక్కిరెడ్డి వంశీకృష్ణ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. నెల్లూరుకు చెందిన మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. మ్యారేజ్‌ బ్యూరోలో ఇద్దరికి మ్యాచ్‌ కుదిరింది. నెల్లూరులో పసుపు తాడు కట్టాడు, తర్వాత ఈ నెల 5న గుట్టుగా మేడ మీద కేవలం తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి పెళ్లి తంతు కానిచ్చాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా మూడో వివాహం బయటపడకుండా ఉండాలన్నది వంశీ ప్లాన్. తనను శారీరకంగా 15 రోజులు వాడుకున్నాక జాతకం బాగాలేదని వెళ్లి పోమంటున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎదురు తిరిగినందుకు వారం పాటు గృహనిర్భందం చేశారని వాపోయింది.

వేధింపులు తట్టుకోలేక బాధితురాలు మరో విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. వంశీ సెక్సువల్‌గా వీక్‌ అని వాళ్ల తండ్రి చెప్తున్నాడు. అతని సామర్ధ్యం గురించి పదేపదే నన్ను అడగటం ఆశ్చర్యమేసిందని అంటోంది. అతను స్ట్రాంగా? వీకా? భార్యకు తెలుస్తోంది తప్పా తండ్రికి ఎలా తెలుసని ప్రశ్నిస్తోంది. అతని వీక్‌నెస్‌ కారణంగా మొదటి ఇద్దరిని పంపించినట్లు తనకు తెలిసిందంటోంది. అతని సామర్ధ్యాన్ని పరీక్షించమని నాకు చెప్తే డాక్టరైనా నేను మెడికల్‌ పరీక్షిద్దామనుకున్నా కాని శారీరకంగా వాడుకుంటారని అనుకోలేదంటోంది.

అమ్మ, నాన్న ప్రోత్సాహంతోనే వంశీ ఇలా చేస్తున్నాడని చెప్తుంటున్న బాధితురాలు ఇప్పుడు నన్ను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అతను చాలా మందితో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడు, తన సామర్ధ్యాన్ని ప్రూవ్ చేసుకునేందుకు ఇలా చేశాడని మండిపడుతోంది. ఇప్పుడు తనతో అతను కలిసి ఉండాలే, లేదంటే కఠినమైన శిక్ష పడాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

బాధితురాలు డెర్మటాలజిస్ట్.. మొదటి భర్త చనిపోగా.. వంశీతో మ్యాచ్‌ కుదిరింది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా.. వంశీకృష్ణ మాట దాటవేస్తుండటంతో ఆమె చివరకు పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో అసలు బాగోతం బట్టబయలైంది. వంశీకి అప్పటికే ఇద్దరు మహిళలతో వివాహం అయ్యిందని, వారికి విడాకులు కూడా ఇచ్చాడని తేలింది. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..