Tirupati Special Trains: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్స్.. వివరాలు
వేసవి సెలవుల కారణంగా పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కాచిగూడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాచిగూడకి 2 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు తెలిపింది.
Summer Special Trains: వేసవికాలంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కిలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి తిరుపతి వెళ్లాలనుకుంటున్న వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే శనివారం ప్రకటన విడుదల చేసింది. వేసవి సెలవుల కారణంగా పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కాచిగూడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాచిగూడకి 2 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు తెలిపింది.
- 07297 కాచిగూడ – తిరుపతి స్పెషల్ ట్రైన్ ను మే 11న నడపనున్నారు. ఈ ట్రైన్ 22.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు 11.00 గంటలకు తిరుపతి చేరుతుంది.
- 07298 తిరుపతి – కాచిగూడ స్పెషల్ ట్రైన్ ను మే 12న నడపనున్నారు. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు 04.00 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని ఎస్‌సీఆర్ ప్రకటనలో తెలిపింది.
02 Summer Special Trains between Kacheguda-Tirupati-Kacheguda @drmhyb @drmsecunderabad @drmgtl pic.twitter.com/rJfT6L8Hpa
— South Central Railway (@SCRailwayIndia) May 7, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: