Hyderabad: లోన్‌యాప్‌ వేధింపులకు మరొకరు బలి.. చెరువులో దూకి విద్యార్ధి ఆత్మహత్య

|

Sep 06, 2024 | 4:36 PM

లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల అత్యవసరంగా డబ్బు అవసరమై లోప్‌ యాప్‌ ద్వారా డబ్బు తీసుకున్న ఓ యువకుడు వేళకు తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో విఫలమయ్యాడు. అంతే యాప్‌ నిర్వహకులు వేదింపులకు తెగబడ్డారు. భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో..

Hyderabad: లోన్‌యాప్‌ వేధింపులకు మరొకరు బలి.. చెరువులో దూకి విద్యార్ధి ఆత్మహత్య
Loan App Harassment
Follow us on

కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 6: లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల అత్యవసరంగా డబ్బు అవసరమై లోప్‌ యాప్‌ ద్వారా డబ్బు తీసుకున్న ఓ యువకుడు వేళకు తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో విఫలమయ్యాడు. అంతే యాప్‌ నిర్వహకులు వేదింపులకు తెగబడ్డారు. భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కుత్బు ల్లాపూర్ నియోజకవర్గంలోని సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన విద్యార్థి భాను ప్రకాష్ (22) స్థానిక ఆరోరా కాలేజీలో పీజీ చదువుతున్నాడు. ఇటీవల లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకున్న భాను తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్‌ నిర్వాహకులు నిత్యం వేధించసాగారు. వీరి వేధింపుల తాళ లేక గత కొంతకాలంగా మదన పడుతున్న భాను.. ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పీఎస్‌ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం శుక్రవారం (సెప్టెంబర్‌6) తెల్లవారు జామున వెలుగులోకి వచ్చింది.

భానుప్రకాష్‌ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతడి స్నేహితులు మొబైల్‌ఫోన్‌ లొకేషన్ ద్వారా ఆచూకీ కనుక్కున్నారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు, వాహనం చెరువు గట్టుపై కనిపించాయి. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయానికి నీళ్లలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. బాను మొబైల్‌లో లోన్ యాప్‌కు సంబంధించిన చాటింగ్‌ లభ్యంమైంది. దీనిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా ఇటీవల కాలంలో లోన్ యాప్ ఆగడాలు శృతి మించుతున్నాయి. పలువురు లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకుని.. అవి సకాలంలో  చెల్లించలేకపోవడంతో యాప్ నిర్వహకులు వారిని మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దీంతో గత్యంతరలేక వారు మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టినిలిపి ఇలాంటి యాప్ లను పూర్తిగా తొలగించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.