Hyderabad: MMTS ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు.. టైమింగ్స్‌ కూడా పొడిగింపు..

MMTS Trains: కరోనా కారణంగా చాలా రోజుల పాటు నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ సేవలు మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. తాజాగా మరికొన్ని రూట్లలో రైళ్లను పునరుద్ధరిస్తూ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad: MMTS ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు.. టైమింగ్స్‌ కూడా పొడిగింపు..
Follow us
Basha Shek

|

Updated on: Apr 14, 2022 | 4:22 PM

MMTS Trains: కరోనా కారణంగా చాలా రోజుల పాటు నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ సేవలు మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. తాజాగా మరికొన్ని రూట్లలో రైళ్లను పునరుద్ధరిస్తూ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 11 నుంచి జంటనగరాల మధ్య మరో 86 ఎంఎంటీస్‌ రైళ్లను నడుపుతున్నారు. కాగా గతంలో ఉదయం 6 నుంచి రాత్రి 11.45 వరకు మాత్రమే ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిచేవి. తాజాగా ఈ టైమింగ్స్‌ ను కూడా పొడిగించారు. ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్ల రాకపోకలు సాగించనున్నట్టు SCR అధికారులు తెలిపారు. దీంతో పాటు ప్రయాణికుల సౌలభ్యం కోసం సీజనల్‌ టిక్కెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

టైమింగ్స్‌ వివరాలేంటంటే..

* 47206 నంబర్‌ గల రైలు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. 5.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

* 47150 నంబర్‌ గల ఎంఎంటీఎస్‌ సర్వీసు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి 7.43 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

* 47195 నంబర్‌ గల రైలు 22.20 గంటలకు బయలు దేరి 23.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

* 47193 నంబర్‌ గల సర్వీసు 23.25 గంటలకు లింగంపల్లి నుంచి బయలు దేరి 00.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

* 47201 నంబర్‌ గల రైలు 16.35 గంటలకు ఫలక్‌నుమా నుంచి బయలుదేరుతుంది. 17.50 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

* 47218 నంబర్‌ గల రైలు 21.05 గంటలకు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి 23.05 గంటలకు రామచంద్రాపురం చేరుకుంటుంది.

* 47177 నంబర్‌ గల రైలు 9.10గంటలకు రామచంద్రాపురం నుంచి బయలుదేరి 11.05 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది.

Also Read: Viral Video: సీసా మూత గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అయిన స్టూడెంట్.. సమయస్ఫూర్తితో రక్షించిన టీచర్

Prime Ministers Museum: నెహ్రూ నుంచి మోదీ వరకు అందరి చరిత్ర.. ప్రధానమంత్రి మ్యూజియం ప్రత్యేకతేంటో తెలుసుకోండి!

Ganta Srinivas: జగన్ బలహీనమైన నాయకుడు.. మాజీ మంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు..