Viral Video: సీసా మూత గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అయిన స్టూడెంట్.. సమయస్ఫూర్తితో రక్షించిన టీచర్

Viral Video: ప్రస్తుతం ఓ వీడియో ఫుటేజ్ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ఓ టీచర్ సమయస్ఫూర్తితో స్పందించి 9 ఏళ్ల విద్యార్థిని జీవితాన్ని కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా..

Viral Video: సీసా మూత గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అయిన స్టూడెంట్.. సమయస్ఫూర్తితో రక్షించిన టీచర్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 14, 2022 | 3:12 PM

Viral Video: ప్రస్తుతం ఓ వీడియో ఫుటేజ్ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ఓ టీచర్ సమయస్ఫూర్తితో స్పందించి 9 ఏళ్ల విద్యార్థిని జీవితాన్ని కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ (goodnews_movement) ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ బుధవారం వీడియోను షేర్ చేసింది. 3 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది. టీచర్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

న్యూజెర్సీలోని ఈస్ట్ ఆరెంజ్ కమ్యూనిటీ చార్టర్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న రాబర్ట్.. బాటిల్‌లోని నీళ్లు తాగాలని భావించాడు. దీంతో వాటర్ బాటిల్ ను తీసుకుని క్యాప్ ను చేతులతో తెరవడానికి బదులు నోటిని ఉపయోగించాడు. ఆ సమయంలో ఆ క్యాప్ బాలుడి గొంతులోకి వెళ్లి ఇరుక్కుంది. దీంతో స్టూడెంట్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. వెంటనే తన గొంతు నుంచి సీసా మూతను బయటకు తీసుకోవాడ్నైకి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ బాలుడు వల్లకాలేదు. దీంతో వెంటనే బాలుడు తన క్లాస్ టీచర్ దగ్గరకు పరిగెత్తాడు.

ఆ బాలుడి టీచర్ జానీస్ జెంకిన్స్. తన స్టూడెంట్ పరిస్థితి చూసి.. కంగారు పడకుండా వెంటనే రక్షించడానికి  చర్యలు తీసుకుంది. గొంతు నుంచి బాటిల్ మూతను బయటకు వచ్చేలా హీమ్లిచ్ యుక్తిని ప్రదర్శించింది. బాలుడి గొంతు లో నుంచి క్యాప్ బయటకు వచ్చేలా చేసింది ఆ ఉపాధ్యాయురాలు. ఇదే విషయంపై స్టూడెంట్ స్పందిస్తూ.. తాను బాటిల్ మూతను పళ్లతో తీసినప్పుడు.. ఆ క్యాప్ తన గొంతులోకి వెళ్లిందని చెప్పినట్లు డైలీ మెయిల్ నివేదించింది.

జెంకిన్స్.. గత ఐదు సంవత్సరాలు పాఠశాలలో టీచర్ ఉద్యోగం చేస్తోంది. ఆమె ప్రీస్కూల్ ఉపాధ్యాయురాలిగా ఉన్నప్పుడు CPR , ప్రాథమిక ప్రథమ చికిత్సలో శిక్షణ పొందింది. అంతేకాదు ఇటీవల రిఫ్రెషర్ కోర్సును తీసుకుంది. తన స్టూడెంట్ విషయంపై జెంకిన్స్.. స్పందిస్తూ.. తన స్టూడెంట్ తన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చినప్పుడు.. మాట్లాడలేకపోయాడు.. గొంతు పట్టుకుని నా వైపు చూస్తున్నాడు.. అప్పుడు పరిస్థితిని అర్ధం చేసుకుని నేను హీమ్లిచ్ తో ప్రాధమిక చికిత్స చేశాను. అదృష్టవశాత్తు క్యాప్ వెంటనే బయటకు వచ్చింది. బాలుడు సేఫ్ గా ఉన్నాడు. అని తెలిపారు ఉపాధ్యాయురాలు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన టీచర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read : Hindu Mythology: దేవుడికి తలనీలాలు సమర్పించడం వెనుక రీజన్.. పుణ్యక్షేత్రంలో కేశఖండన ప్రాంతాన్ని ‘కల్యాణకట్ట’ అని ఎందుకు అంటారంటే..