MMTS Trains Cancelled: ఇటీవల వారాంతాల్లో ముఖ్యంగా ఆదివారాల్లో ఎంఎంటీస్ రైళ్ల (MMTS Trains) సర్వీసులను రైల్వే శాఖ బాగా తగ్గిస్తోన్న సంగతి తెలిసిందే. రద్దీ లేని మార్గాల్లో వీలైనంతవరకు సర్వీసులను నిలిపేస్తూ వస్తోంది. ఈక్రమంలో మరోసారి ఎంఎంటీస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. ఆదివారం (జులై3) పలు లోకల్ ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులు, ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన రైళ్ల వివరాలివే..
లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో..
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
హైదరాబాద్- లింగంపల్లి రూట్‌లో..
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో..
47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి- ఫలక్ నూమా రూట్‌లో..
47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో..
47150
లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో..
47195
Cancellation of MMTS train services @drmsecunderabad @drmhyb pic.twitter.com/ldqHLV8P6D
— South Central Railway (@SCRailwayIndia) July 1, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..