AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య

భార్య పుట్టినరోజున హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లి దేవినగర్‌లో నివసిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. భార్యకు ‘సారీ.. గుడ్‌బై’ అంటూ మెసేజ్ పంపిన అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు..

‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య
Hyderabad Software Employee Dies By Self
Srilakshmi C
|

Updated on: Sep 03, 2026 | 4:03 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్‌ 3: ‘పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై’ అంటూ భార్యకు మెసేజ్ పంపిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య పుట్టినరోజు నాడే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దరాబాద్‌లోని కూకట్‌పల్లి దేవినగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లేం జరిగిందంటే..

కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్ (40) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య రాధికతో కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి దేవినగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్య రాధిక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు వేడుకలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే రమేష్ తాను రావడం లేదని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాడు. రాధిక తన అక్క, తమ్ముడితో కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత రమేష్ తన భార్య ఫోన్‌కు ‘పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై’ అంటూ మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసిన రాధిక తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే ఇంటికి వెళ్లి చూడగా రమేష్ అప్పటికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులను విచారిస్తూ ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గమనిక: ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. సన్నిహితులతో లేదంటే మానసిక నిపుణులను సంప్రదించి సమస్యను వెల్లడించడం మంచిది.

Follow Us