AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బ్రేకింగ్ న్యూస్.. షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత అనుమానాస్పద మృతి..

షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత గుండెపోటుతో మరణించారు. అవినీతి ఆరోపణలు, భర్త ఆత్మహత్యతో కొంతకాలంగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.

Hyderabad: బ్రేకింగ్ న్యూస్..  షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత అనుమానాస్పద మృతి..
Sujatha (File Photo)
Ram Naramaneni
|

Updated on: Sep 03, 2022 | 11:06 AM

Share

బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత ఆకస్మికంగా మృతిచెందారు. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే సుజాత గుండెపోటుతోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.  బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని రూ. 40 కోట్ల విలువైన ల్యాండ్ కేసులో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడం, ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు సరైన ఆధారాలు చూపకపోవడం, ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఆమె గతంలో అరెస్టయ్యారు. కోర్టు విచారణలో ఉన్న భూమిని ఖాలిద్ అనే వ్యక్తికి అనుకూలంగా రికార్డు తయారు చేసేందుకు లంచం తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ ఆమెను విచారించింది. ఆ తర్వాత ఒకసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. కాగా 2020 జూన్ నెలలో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకన్నారు. సోదరి ఇంటి  భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. భార్యపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సుజాత భర్తను కూడా అప్పట్లో ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ వేధింపుల వల్లే అజయ్ సూసైడ్ చేసుకున్నాడని అప్పట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..