Hyderabad: పోర్న్‌హబ్‌గా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఫ్రీ డేటా మొత్తం ఆ వీడియోలకే

గతంలో ఓ సామెత ఉండేది.. మీరు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని. ఇప్పుడా సామెత ఔట్‌ డేటెడ్‌ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే.. ఎంత లేటైతే అంత గ్రేటు అనుకుంటున్నారు కొంతమంది ప్రయాణికులు. ఎందుకో తెలుసుకుందాం పదండి.

Hyderabad: పోర్న్‌హబ్‌గా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఫ్రీ డేటా మొత్తం ఆ వీడియోలకే
Secunderabad Railway Statio
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2022 | 5:44 PM

Secunderabad railway station: అసలు ఏమన్నా అంటే అన్నామంటారుగాని.. ఈ ఫ్రీవైఫై పెట్టిన ఉద్దేశమేంటి? జనాలు వాడే పర్పస్‌ ఏంటి? సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ కి వెళ్తే వందల మంది ప్రయాణికులు నిత్యం రైళ్ల కోసం వెయిట్‌ చేస్తూనే కనిపిస్తారు. ఎక్కేవారు ఎక్కుతూ.. దిగేవారు దిగుతూ ఉంటారు. తమ రైలు లేటైతో ప్లాట్‌ఫామ్స్‌ మీదే పడిగాపులు పడుతుంటారు. ఈ వెయిటింగ్‌ పీరియడ్‌లో ఏం జరుగుతోంది? ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. రైల్వే అధికారులే షాకయ్యే నిజాలు బయటికొచ్చాయి. ఫ్రీ వైఫై వాడుతున్న ట్రావెలర్స్‌.. ఎక్కువగా పోర్న్‌ వీడియోలు చూస్తూ.. కొందరు డౌన్లోడింగ్‌ చేస్తూ డేటాని ఖాళీ చేస్తున్నారు. నిర్ణీత సమయంలో ఇచ్చిన డేటా మొత్తం దీనికే వాడేస్తున్నారు ప్రయాణికులు. ఈ తతంగం ఒక్క సికింద్రాబాద్‌లోనే కాదు.. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేస్‌(South Central Railway)లో ఉన్న విజయవాడ(Vijayawada), తిరుపతి(Tirupati) స్టేషన్లలోనూ నడుస్తోంది. సికింద్రాబాద్‌ స్టేషేన్లో రైల్‌టెల్‌ కంపెనీ.. రైల్‌వైర్‌ పేరుతో ఫ్రీ వైఫై ఇస్తోంది. ప్రయాణికులు ఎమర్జెన్సీలో వాడుకోడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. రోజుకి 30 నిమిషాలపాటు ఈ ఫ్రీ డేటా సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మొత్తం 350 ఎంబీ డేటాని ప్రొవైడ్‌ చేస్తోంది రైల్‌టెల్‌. నిజానికి ఇచ్చిన ఈ డేటా హైస్పీడ్‌ అంటూ రైల్వేస్‌ ఊదరగొడుతున్నా.. వాస్తవానికి ఏమంత స్పీడ్‌ ఉండడం లేదు. దీనికి కారణం ఈ డౌన్‌లోడ్లే. విపరీతమైన డౌన్‌లోడింగ్‌ వల్ల.. అసలు వైఫైని ఎమర్జెన్సీలో ఉపయోగించుకునేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్‌వైర్‌ వైఫైని ఉపయోగించేవారిలో 35శాతం పోర్న్‌సైట్లలో వీడియోలు చూడడం, డౌన్‌లోడ్‌లు చేయడం జరుగుతోందని సర్వీస్‌ ప్రొవైడర్లు చెబుతున్నారు. ఈ పోర్న్‌ కంటెంట్‌ తర్వాత యూట్యూబ్‌ స్ట్రీమింగ్‌, డౌన్‌లోడింగ్‌ జరగుతున్నట్లు తెలుస్తోంది.

దక్షిణమధ్య రైల్వేలో కొన్ని స్టేషన్లలోనే ఈ ఫ్రీ వైఫై అందుబాటులో ఉంది. దీన్ని 558 స్టేషన్లకు విస్తరించాలని భావిస్తోంది రైల్వేస్‌. కాని డేటా చూస్తే జనాలు పోర్న్‌ కోసమే అధికంగా వాడుతుండడంతో అధికారులు షాక్‌ అవుతున్నారు. విజయవాడ, టెంపుల్‌ సిటీ తిరుపతి రైల్వేస్టేషన్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రైల్‌వైర్‌ ఇప్పటికే వందలాది పోర్న్‌ సైట్లను నిషేధించింది కాని.. VPN సహాయంతో ఆ సైట్లను వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్‌టెల్‌ నిర్వాహకులు నిరంతరం ఈ సైట్లను బ్లాక్‌ చేస్తున్నా.. యూజర్లు మాత్రం కొత్త మార్గాల్లో డౌన్లోడ్స్‌ చేస్తున్నారని అధికారులంటున్నారు.

దేశంలో రైల్‌వైర్‌ని 1.2మిలియన్ల మంది నిరంతరం ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిలో చాలామంది పోర్న్‌ సైట్ల నుంచి డౌన్లోడ్స్‌ చేస్తున్నట్లు బయటపడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1600 స్టేషన్లలో వైఫైని రన్‌ చేస్తోంది రైల్‌టెల్‌. అందులో సికింద్రబాద్‌ స్టేషన్‌ డౌన్‌లోడింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఈ వైఫై యూజర్లు యావరేజ్‌గా 350 ఎంబీల డేటాని డౌన్‌లోడ్‌ చేస్తుంటే.. అందులో 90శాతం పోర్న్‌కే ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. మరి దీని కట్టడి ఎలా. స్టేషన్లలో ఇంత విచ్చలవిడిగా పోర్న్‌ చూస్తుంటే.. అందులోనూ తిరుపతి లాంటి టెంపుల్‌ సిటీలో చేస్తుంటే.. కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి