Hyderabad: భాగ్య నగరానికి మరో దిగ్గజ ఫార్మా సంస్థ.. 18,000 మందికి లభించనున్న ఉపాధి.

ఐటీ, ఫార్మా కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హైదరాబాద్‌కు పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపిబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు...

Hyderabad: భాగ్య నగరానికి మరో దిగ్గజ ఫార్మా సంస్థ.. 18,000 మందికి లభించనున్న ఉపాధి.
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 31, 2023 | 3:24 PM

ఐటీ, ఫార్మా కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హైదరాబాద్‌కు పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపిబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్ ని అందించనున్నట్లు తెలిపింది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది.

మంగళవారం శాండోస్ కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమై ఈ మేరకు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది. ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

శాండోస్‌ సంస్థ గ్లోబల్‌ క్యాపిబిలీటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార అనుకూలత, అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్ సైన్సెస్ రంగం మరింతగా వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, శాండోస్ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించారు. హైదరాబాద్ నగరంలోనే ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్ తన రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాదులో కలిగి ఉందని, ఇదే స్థాయిలో శాండోస్‌ కూడా హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను విస్తరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక శాండోస్‌ ప్రతినిధి బృందం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఉన్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు ప్రధాన కారణమని తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్ సంస్థ నోవార్టీస్ హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తోందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే పరిశోధనలను హైదరాబాద్‌ నుంచి నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..