AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్: కేసీఆర్ బెదిరించినా.. యూనియన్లు కొనసాగుతాయి

దీక్షా దివస్ గిఫ్ట్‌గా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులందరిని రేపటి నుంచి విధుల్లోకి హాజరు కావాలని సూచించారు. ఈ ప్రకారం లిఖితపూర్వక లేఖను అందజేస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తక్షణమే ఆర్టీసీకి వంద కోట్లు మంజూరు చేస్తామన్నారు. అటు ప్రతి డిపో కార్మికులందరితో మాట్లాడి యూనియన్లనేవి లేకుండా చేస్తామనని ఆయన అన్నారు. ఇక ఈ తరుణంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఫోన్ లైన్ ద్వారా టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌కు అందుబాటులోకి వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. […]

ఫ్లాష్: కేసీఆర్ బెదిరించినా.. యూనియన్లు కొనసాగుతాయి
Ravi Kiran
|

Updated on: Nov 28, 2019 | 9:46 PM

Share

దీక్షా దివస్ గిఫ్ట్‌గా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులందరిని రేపటి నుంచి విధుల్లోకి హాజరు కావాలని సూచించారు. ఈ ప్రకారం లిఖితపూర్వక లేఖను అందజేస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తక్షణమే ఆర్టీసీకి వంద కోట్లు మంజూరు చేస్తామన్నారు. అటు ప్రతి డిపో కార్మికులందరితో మాట్లాడి యూనియన్లనేవి లేకుండా చేస్తామనని ఆయన అన్నారు.

ఇక ఈ తరుణంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఫోన్ లైన్ ద్వారా టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌కు అందుబాటులోకి వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులను రేపటి నుంచి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఆయన ప్రకటనపై తమకెలాంటి అభ్యంతరం లేదని అశ్వత్థామరెడ్డి చెప్పుకొచ్చారు. యూనియన్లకు నాయకత్వం వహించాలని తమకు కోరికలు లేవని.. సమస్యలను పరిష్కరిస్తామంటే స్వాగతిస్తామని ఆయన అన్నారు.  అంతేకాకుండా రెండు రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్న ఆర్టీసీ జేఏసీ.. సమ్మె కారణంగా ఇబ్బంది పడ్డ ప్రజలందరికి క్షమాపణలు చెబుతున్నామన్నారు. పెద్ద మనసుతో ప్రజలు మమ్మల్ని అర్ధం చేసుకున్నారని.. ప్రభుత్వం కూడా తమ బాధ్యత వహించాలని కోరారు.

ప్రభుత్వం ముందే చర్చలకు పిలిచి మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని.. అంతేకాక ఈ అంశంలో తాము ఓడిపోలేదని.. అలాగని ప్రభుత్వం కూడా గెలవలేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కాగా, కార్మికుల భవిష్యత్తు గురించి అలోచించి.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేశారు.  ఇకపోతే కేసీఆర్ అనుకున్నట్లు ఆర్టీసీ జేఏసీ తొలిగించడం సాధ్యం కాదని.. కార్మికుల సమస్యల కోసం జేఏసీ ఎల్లప్పుడూ ఉంటుందని కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

మరోవైపు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. యూనియన్లను తీసేసి హక్కు ఎవరికి లేదని.. అలాగని వెల్‌ఫేర్ కమిటీ వస్తే.. మేము తప్పకుండా స్వాగతిస్తామన్నారు. కార్మికులపై వర్క్ లోడ్ పెంచడం వల్లే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఏది ఏమైనా యూనియన్లు కొనసాగుతాయని.. అధికారులే ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారని చెప్పారు.

బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు