Hyderabad: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌కు వరుణ గండం.. ఇదిగో వెదర్ రిపోర్ట్
క్రికెట్ లవర్స్‌కి పసందైన ఆటను పంచే ఐపీఎల్ 16 ప్రారంభమయ్యింది. భారి అంచనాలతో అన్ని జట్లు టైటిల్ విన్నర్ కోసం పోటీపడుతున్నాయి. ఎస్ ఆర్ హెచ్ తొలి మ్యాచ్ హైదరాబాద్ లో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి టెన్షన్ పట్టుకుంది.
క్రేజీ షాట్స్.. మ్యాజిక్ బౌలింగ్… మ్యాజిక్ ఫిల్డింగ్.. ఊహించని సంచలనాలు… వీటన్నింటికి కేరాఫ్ అడ్రస్ ఐపీఎల్. 2023 మార్చి 31న ఐపీఎల్ 16 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే గత 2 సీజన్స్ నుంచి మన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ దశకు కూడా చేరకుండానే ఇంటి బాట పట్టింది. ఈ సారి టీమ్ సరైన మజా అందించి.. కప్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ సారి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను ముందుండి నడిపించి.. టైటిల్ అందించిన ఏడెన్ మార్‌క్రమ్ కెప్టెన్ అవ్వడంతో.. ఈ సారి ఆశలు గట్టిగానే ఉన్నాయి.
ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్.. మన భాగ్యనగరంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు సారథి ఏడెన్ మార్‌క్రమ్.. స్టార్ ఆటగాళ్లు మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్‌లు అందుబాటులో ఉండకపోవడం ఒక రకంగా ఇబ్బంది కలిగించే విషయం. ఇకపోతే.. 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్‌కు వరుణుడి గండం ఏర్పడింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా అప్పటికప్పుడే వెదర్ మారిపోయి.. జడివాన కురుస్తుంది. దీంతో టికెట్స్ కొన్న ఫ్యాన్స్‌కు రెయిన్ టెన్షన్ పట్టుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్: ఏడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, సమర్థ్ వ్యాస్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, వివ్రాంత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్‌కుమార్ రెడ్డి, ఫజల్ హక్ ఫారూఖీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, అభిషేక్ శర్మ, ఉపేంద్ర యాదవ్, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, భువనేశ్వర్ కుమార్, అకీల్ హొసేన్, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, మయాంక్ డాగర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..