Hyderabad Metro:మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. రాయితీల విషయంలో కీలక మార్పులు.. రేపటి నుంచే అమలు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. మెట్రో రైల్ చార్జీలలో కార్డు, క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించి కొనే టికెట్లపై 10 శాతం రాయితీని ఎల్ అండ్ టీ మెట్రో వెనక్కు తీసుకుంది. రోజులో కేవలం 6 గంటలు.. అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ.. తిరిగి రాత్రి 8 గంటల నుంచి..
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. మెట్రో రైల్ చార్జీలలో కార్డు, క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించి కొనే టికెట్లపై 10 శాతం రాయితీని ఎల్ అండ్ టీ మెట్రో వెనక్కు తీసుకుంది. రోజులో కేవలం 6 గంటలు.. అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ.. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టికెట్లపై రాయితీ ఉండదన్నమాట. శనివారం ( ఏప్రిల్ 1) నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని భారీగా పెంచనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు రూ.59గా ఉన్న ధరను రేపటి నుంచి రూ.99కి పెంచనున్నారు. ఇప్పటికే రూ.59లతో కార్డు తీసుకున్న వారు.. సూపర్ సేవర్ రూ.99 రీఛార్జ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే కొత్తగా కార్తు తీసుకునే వారు మాత్రం విధిగా రూ.100 చెల్లించాలని చెప్పారు. ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నోటిఫైడ్ హాలీడేస్ జాబితా ఆన్‌లైన్‌తో పాటుగా అన్ని మెట్రో స్టేషన్‌ల వద్ద అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ మెట్రో సూచించింది.
కాగా హైదరాబాద్ మెట్రోలో ప్రతి రోజూ సుమారు 4.4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం మూడు కారిడార్లలో 57 స్టేషన్లు, 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలందిస్తోంది. కాగా 10 శాతం రాయితీ ఉపసంహరణతో ప్రయాణికులకు మెట్రో ప్రయాణం భారంగా మారనుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రయాణం చేసే వారిపై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా రోజువారీ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. రద్దీ సమయాల్లో రాయితీని ఎత్తివేసి ప్రయాణికులు లేని సమయంలో రాయితీని కొనసాగించడం పట్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రయాణికులు వాపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..