Hyderabad: ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాస్.. పైకి చూస్తే పంచె.. విప్పి చూస్తే మైండ్ బ్లాంక్
పంచెలు అమ్మితే కోట్ల రూపాయలు కురుస్తాయి. యస్. మీరు విన్నది నిజమే. అవి ఉత్త పంచెలు మాత్రమే కాదు. కట్టి చూస్తే పంచె. విప్పి చూస్తే డ్రగ్స్. పంచెల యవ్వారాన్ని రాచకొండ పోలీసులు బయటకు లాగితే డ్రగ్స్ డొంక కదులుతోంది.

పంచెలు అమ్మితే కోట్ల రూపాయలు కురుస్తాయి. యస్. మీరు విన్నది నిజమే. అవి ఉత్త పంచెలు మాత్రమే కాదు. కట్టి చూస్తే పంచె. విప్పి చూస్తే డ్రగ్స్. పంచెల యవ్వారాన్ని రాచకొండ పోలీసులు బయటకు లాగితే డ్రగ్స్ డొంక కదులుతోంది. పంచెల మాటున విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు పోలీసులు. మత్తు ముఠా సభ్యులకు రాచ మర్యాదలు చేసి మరిన్ని వివరాలు రాబడుతున్నారు రాచకొండ పోలీసులు. పంచె కట్టుకుంటే సమ్మర్‌లో హాయ్ హాయ్…అదే మాకు ఎంజాయ్ అంటున్నాయి డ్రగ్స్ గ్యాంగ్స్. పంచెల్లో ప్యాక్ చేసిన డ్రగ్స్ దందాకు పోలీసులు రెండు నెలల క్రితం బ్రేకులు వేశారు. పంచెలు చించి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుని మత్తు ముఠాలను కటకటాల్లో వేశారు రాచకొండ పోలీసులు. అయతే ఇప్పుడు అవే గమ్మత్తు ముఠాలు మళ్లీ పంచెలు కట్టాయి. డ్రగ్స్‌ని పంచెల్లో పెట్టి నీట్‌గా ప్యాకింగ్ చేసి విదేశాలకు సప్లయ్ చేసేస్తున్నాయి. పంచెల్లో డ్రగ్స్ పెట్టి కొరియర్ ద్వారా విదేశాలకు పంపిస్తున్న ఇంటర్నేషనల్ కేటుగాళ్లకు మరోసారి బేడీలు వేశారు రాచకొండ పోలీస్.
డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు..
కొకైన్, ఎల్‌ఎస్‌డీ, బ్రౌన్‌షుగర్, ఎండీఎంఏ పేర్లు వేరైనా వాటి ద్వారా వచ్చే మత్తు ఒకటే. కొరియర్ సర్వీస్ ద్వారా ఆర్డర్ చేసిన డ్రగ్స్ ను ఇంటికే పంపుతున్నారు. యువతను మత్తులో ముంచుతోంది డ్రగ్స్ మాఫియా. ఏకంగా డ్రగ్స్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తోంది ఈ ముఠా. గతంలో పట్టుకున్న డ్రగ్స్ కొరియర్ ముఠా లోని మరో ఇద్దరు ఫరీద్, ఫయాజ్ ను తాజాగా అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ఈ డ్రగ్స్ దందాను సకుటుంబ సపరివార సమేతంగా నడిపిస్తోంది ఓ కుటుంబం. ఈ ఫ్యామిలీ బిజినెస్ బ్యాచ్‌లో ఇద్దరిని గతంలో పట్టుకున్న పోలీసులు తాజాగా మరో ఇద్దరిని లోపలేశారు. డిసెంబర్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు అయింది. అప్పట్లో వాళ్ల దగ్గర నుంచి 8.5 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రగ్స్ విలువ రూ. 9 కోట్లు. గ్రాము ధర రూ.10 వేలు. ఆ కేసులో మహమ్మద్ ఖాసిం, రసూలుద్దీన్‌లను అరెస్టు చేశారు.
ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ ముసుగులో..
కాగా ఇదే కేసుకు సంబంధించి షేక్ ఫరీద్, ఫయాజ్ అనే మరో ఇద్దరు పూణే నుంచి హైదరాబాద్ వచ్చారని, డ్రగ్స్ కొరియర్ చెయ్యబోతున్నారని ఇన్ఫర్మేషన్ అందడంతో పోలీసులు వాళ్లను తెలివిగా ట్రాప్ చేశారు. పూణే నుంచి వచ్చిన ఈ గ్యాంగ్ కొరియర్ బాక్సుల్లో డ్రగ్స్ దాచి విదేశాలకు ఎగుమతి చేయబోతుండగా టాస్క్‌ఫోర్స్ టీమ్ వాళ్లను అరెస్ట్ చేసింది. ఈ బ్యాచ్ అంతా పూణేకు చెందినవాళ్లు. మలేషియా దుబాయ్ నుంచి స్మగుల్డ్ గూడ్స్ తీసుకొచ్చి అమ్ముతుండేవారు. గూడ్స్ స్మగ్లింగ్ నుంచి మెల్లగా ఎదిగి డ్రగ్స్ ఎగుమతి చేయటం మొదలెట్టారు. కాగా మెటాఫెటమైన్ డ్రగ్స్ కి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో డిమాండ్ ఎక్కువ. సూడో ఎపిడ్రిన్ కేజీ కోటి రూపాయల రేటు పలుకుతోంది. దాని నుంచి కెమికల్ ప్రాసెస్ చేసి తయారు చేసిన మెటాఫెటమైన్ కిలో 5 కోట్లు ధర పలుకుతోంది. నిందితుల నుంచి నగదు, 2మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ గ్యాంగ్ నుంచి అర కిలో సూడో ఎపిడ్రిన్, 80 గ్రాముల గోల్డ్‌ను సీజ్ చేశారు పోలీసులు. ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ ముసుగులో ఈ దందాను నడిపిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ దందాలో పాత్రధారులనే కాదు.. సూత్రధారులను కూడా త్వరలోనే పట్టుకుంటామంటున్నారు రాచకొండ సీపీ. కాగా సింథటిక్ డ్రగ్స్ చాలా డేంజర్ అంటున్నారు సీపీ. ఒక్కసారి టచ్ చేస్తే అదింక మీతో టచ్‌లోనే ఉంటుంది. భద్రం బీకేర్‌ఫుల్ అంటూ యువతను హెచ్చరించారు సీపీ.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..
