Hyderabad: మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టిన ఇన్స్‌పెక్టర్.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో రికార్డు.. పోలీసు శాఖలో కలకలం..

Hyderabad News: ఆయనొక బాధ్యత గల ఆఫీసర్.. అయినా, కానీ.. ఫుల్లుగా తాగాడు.. తగ్గేదేలే అంటూ జాతీయ రహదారిపై దూసుకెళ్లాడు.. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టాడు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.. అయితే, యాక్సిడెంట్ అయిన కాసేపటికీ..

Hyderabad: మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టిన ఇన్స్‌పెక్టర్.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో రికార్డు.. పోలీసు శాఖలో కలకలం..
Drunken Driving

Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 26, 2023 | 12:09 PM

హైదరాబాద్, ఆగస్టు 26: ఆయనొక బాధ్యత గల ఆఫీసర్.. అయినా, కానీ.. ఫుల్లుగా తాగాడు.. తగ్గేదేలే అంటూ జాతీయ రహదారిపై దూసుకెళ్లాడు.. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టాడు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.. అయితే, యాక్సిడెంట్ అయిన కాసేపటికీ.. కట్ చేస్తే వాహనం నడిపింది ఓ పోలీసు ఇన్స్‌పెక్టర్ అని తేలింది. ఈ రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటోను ఒక వాహనం ఢీ కొట్టిందని.. అందులో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయయని తెలిపారు.

ఐటీ విభాగంలో ఇన్స్‌పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ మద్యం సేవించి వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. శ్రీనివాస్ మద్యం మత్తులో కూరగాయల లోడ్‌తో వెళుతున్న ఆటోను ఢీకొట్టగా.. ఈప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయని.. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు.

సిఐ వాహనంపై ఆరు ట్రాఫిక్ చలాన్లు
డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాల్సిన పోలీసులే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్స్‌పెక్టర్ నడుపుతున్న వాహనంపై ఏకంగా 6 పెండింగ్ చాలాన్లు కూడా ఉన్నాయి. ప్రమాదానికి గురైన కార్ నెంబర్ TS 09 EY 3330. ఈ వాహనం ఓవర్ స్పీడ్ తోపాటు నో పార్కింగ్ చలాన్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఫుల్లుగా మద్యం తాగిన ఇన్స్‌పెక్టర్..

ప్రమాదానికి గురైన సమయంలో మోతాదుకు నుంచి మద్యం సేవించినట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో ఇన్స్పెక్టర్ కు 210 పాయింట్లు వచ్చింది. ప్రస్తుతం పోలీస్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌లో శ్రీనివాస్ ఐటీ సెల్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ప్రమాదం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపింది. బాధ్యత గల ఆఫీసర్ అలా తాగి వాహనం నడపడం గురించి పలువురు విమర్శిస్తున్న తరుణంలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..