Hyderabad: అగ్ని ప్రమాదం కాదు, దారుణ హత్య.. కూకట్‌పల్లి జిమ్‌ ట్రైనర్‌ మృతి కేసులో విస్తుపోయే నిజాలు.

వారం రోజుల క్రితం కూకట్‌పల్లి ప్రసన్న నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో జయకృష్ణ అనే జిమ్‌ ట్రైనర్‌ మరణించిన విషయం విధితమే. అయితే మొదట్లో ప్రమాదం, ఆ తర్వాత ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణలో పోలీసులకు దిమ్మతిరిగే...

Hyderabad: అగ్ని ప్రమాదం కాదు, దారుణ హత్య.. కూకట్‌పల్లి జిమ్‌ ట్రైనర్‌ మృతి కేసులో విస్తుపోయే నిజాలు.
Representative Image

Updated on: May 19, 2023 | 10:40 AM

వారం రోజుల క్రితం కూకట్‌పల్లి ప్రసన్న నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో జయకృష్ణ అనే జిమ్‌ ట్రైనర్‌ మరణించిన విషయం విధితమే. అయితే మొదట్లో ప్రమాదం, ఆ తర్వాత ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణలో పోలీసులకు దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. జిమ్ ట్రైనర్‌ మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇది ప్రమాదమో, ఆత్మహత్యో కాదని పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తేలిపోయింది.

పోలీసుల విచారణలో జయకృష్ణది హత్య అనే విషయం బయటపడింది. జయకృష్ణను హతమార్చింది మరెవరో కాదు, కట్టుకున్న భార్యనేనని తేలింది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యఅగ్నిప్రమాదంలో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్‌లో విచారణ ప్రారంభించగానే అసలు విషయం బయటపడింది. గత ఐదేళ్లుగా చిన్నా అనే వ్యక్తితో మృతి భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల ఈ విషయం తెలిసిన జయకృష్ణ కుటుంబాన్ని హైదరాబాద్‌ నుంచి షిప్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తమ బంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా తొలగించాలని కన్నింగ్ ప్లాన్‌ వేసిన భార్య ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసింది. భర్త అడ్డు తొలగించుకుంటే ఇద్దరు కలిసి ఉండొచ్చని హత్యకు ప్లాన్ వేశారు. నిప్పు అంటించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం ఇద్దరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..