ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసినట్లు ప్రకటి౦చారు. పోలీసు శాఖకోసం, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులు కొనియాడారు. నగరంలో ప్రధాన సమస్యలుగా ఉన్న పేకాట, గుడుంబా, డ్రగ్స్, కల్తీల నిరోధకంతోపాటు నేరస్థులపై ఉక్కుపాదం, మహిళల భద్రతకోసం పోలీసులు చేస్తున్న కృషిని సీఎం అభినందించడంపై ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికే తలమానికంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రాను౦ది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లో 20 అంతస్తుల్లో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి సిస్టమ్ అందుబాటులో లేదు. రాష్ట్రాన్ని శాంతిభద్రతలకు నిలయంగా మార్చడమే లక్ష్యమని ప్రస్తావించిన నేపథ్యంలో నేరరహిత తెలంగాణే ధ్యేయంగా పోలీ్‌సశాఖ అడుగులు వేస్తోంది.